కంటిచూపు ఆననోళ్ళు
ఆశలన్నీ రాలినోళ్ళు
మతిమరుపు వరమైనోళ్ళు
రెండో బాల్యం పొడచూపిన
పండుటాకులు
వీరు తాము కన్నకొడుకులకు
కొడుకులాంటి వాళ్ళు
తమపిల్లలవోలే
ప్రేమగా చూడవలసిన పెద్దవాళ్ళుకు
మనమే అమ్మానాన్నలము
జాలిగా మన వైపు
చూసెటోళ్ళు
ఎన్నోబాధలు అనుభవించినోళ్ళు
స్వార్థపరులైన
కొడుకు కోడళ్ళ
ఆరళ్ళకు బలైపోయినోళ్ళు
ఉన్నదంతా తమ పిల్లలకు పంచి
చేతిలో చిల్లిగవ్వలేనోళ్ళు
వృద్ధాశ్రమంలో తలదాచుకునేవాళ్ళు
ఆకలి రోగాన్ని జయించలేక
కంచంలో కూడువేసే నాథుడే కరువై
వీధి వీధి తిరిగి
భిక్ష మెత్తే
అందరున్నా ఎవరూ లేని
అనాథలు వారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి