తనకు అవసరముంటే
నక్కవినయాలు
వంగి వంగి దండాలు
అవసరం తీరాక
నకరాలు, తకరారు
వాడి కష్టనష్టాలను
నేను నెత్తికెత్తుకోవాలి
నాకు ప్రమాదం జరిగినా
ఎద్దు పుండు కాకికి ముద్దా!
అన్నచందం వాడిది
వాడి ఏడ్పులు పెడబొబ్బలకు
నేను ఓదార్పు గీతం పాడాలి
నేను బాధల్లో ఉంటే
కనీసం కన్నెత్తైనా చూడడు
నేను చేసే కష్టమంతా
నా బరువు బాధ్యత అంటాడు
వాడిది పరాన్నజీవనమైన
తామే బ్రతికేస్తున్నమన్న బీరాలు
తినేది నాన్న రెక్కల కష్టం కృతజ్ఞతలేకుండా పచ్చిఅబద్ధాలు
నేను ఎప్పుడూ మారని మనిషిని
సదువురాని మొద్దును
లోకాన్ని సదవుకున్నోన్ని
గడియగడియకోచిత్తం
పూటకో పూటకోమాటలు చెప్పే పుండాకోరునుకాను నేను
తిమ్మిని బమ్మి చేయలేను
నాది బ్రతుకుపోరుతప్పా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి