చచ్చినా బ్రతకాలి
మన ఆశయాలను బ్రతికించి చూపాలి
త్యాగం మనపేరుగా నిలవాలి
మంచి మానవత్వానికి మనం నిలువెత్తు నిదర్శనమవ్వాలి
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు
జాతిని నడిపించాలి
పరోపకారం మన జీవనవిధానమవ్వాలి
చెడును త్రుంచి మంచి పెంచే
మార్గదర్శకులంమనమవ్వాలి
జాతి అనైక్యత పొడచూపితే
ఏకతాటిపైకి తెచ్చి ఏకత్వం చాటాలి
విపత్కర పరిస్థితుల్లో కూడా
విజ్ఞతను చూపేటి
విశ్వాసులమవ్వాలి
మనం నేర్చిన చదువు
సంఘం నీతి నియమాలు
సామాజిక పునాదులుగా
సన్మార్గం వైపు నడవాలి
సమసమాజ స్థాపనకై మనంకదంతొక్కికదలాలి
సామాజిక ఉద్యమాలు
త్యాగధనుల ఆశయాలు
భావితరాలకు స్ఫూర్తిగా
ముందుకు తీసుకెళ్లాలి
జాతీయవాదమే ఆమోదయోగ్యమై
సమాఖ్య స్ఫూర్తిచాటాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి