ఉద్వేగాలతో ఊగిపోతారు=(విలువలు లేని విద్య): - అంకాల సోమయ్య -దేవరుప్పుల- జనగామ -9640748497
విలువలు లేని విద్య 
అది నేర్చినా ఒకటే
నేర్వకున్నా ఒకటే

గురువు అంటే తండ్రి అనే
అర్థంమరిచిన కుసంస్కారులు 
గురువు మీదే చేయిచేసుకున్న 
పరమకంత్రిగాళ్ళు
పోరంబోకులు 

గవర్నమెంట్ స్కూల్లో 
చదివే విద్యార్థులంటే
యాచకుల పిల్లలు 
ఎస్సీ ఎస్టీ ఎమ్ బీసీ వారే కదా

తల్లిదండ్రులను కాకా పట్టడం ఆన్లైన్ చదువుఅనో ఫోనుంటే బాగా చదివి మిమ్మల్ని ఉద్ధరిస్తామని మభ్యపెట్టడంతో వారు ఈఎమ్త్మైలోస్మార్ట్ ఫోనుకొనడం
ఇక పిల్లల పోకిరితనం షూరూ
స్మార్ట్ ఫోన్ లోసోషల్ మీడియా సైట్స్ యూట్యూబ్ 
ఇన్స్టాగ్రామ్ 
ఫేస్బుక్లో రీల్స్ 
అడ్డు అదుపు లేని వల్గర్ కంటెంట్ చూస్తూ
విద్యార్థులు తప్పు దోవ పడుతున్నారు 

ఇంట్లో తల్లిదండ్రులు 
తమ పిల్లల కడుపు నింపడానికి
ప్రొద్దంత కాయకష్టం 
ఈ పిల్లలేమో బలాదూర్ తిరుగుడు
గ్యాంగ్ మెయింటెయిన్ చేయడం 
మద్యం సేవించడం 
గంజాయి దమ్ములాగడం
అమ్మాయిలను ఆటపట్టించడం
వాడు చేసింది 
తప్పని ఎవడూ చెప్పొద్దూ 
మితిమీరినతప్పులతో
తప్పని తేలితే
బాలనేరస్థులుగా ముద్రపడడం
జైలు జీవితం 
తప్పును తప్పు అని చెప్పే
గురుస్థానం
కళతప్పిందిప్పుడు
గురువంటే తానో పాయింటర్ తప్పితే మరేమీ కాదు 

వెధవ బడవ 
బడుద్దాయి
అనే మాటలు కూడా అనలేని 
గురువులు
విద్యాకమీషన్లు
విద్యాహక్కు చట్టాలు
విద్యార్థి కేంద్రంగా ఉండడం 
గురువు గౌరవాన్ని 
ప్రతిష్టను దిగజార్చడమేకదా
ఉపాధ్యాయ విధులను ప్రస్తావించిన కమీషన్లు విద్యార్థి బాధ్యతలు గురించి తెలుపకపోవడం 
ఈ విచ్చలవిడితనానికి పరాకాష్ట 

ఈ రోజుల్లో తరగతి గదుల్లో గురువులుపాఠాలు చెప్పడం అంటే ఏ మూల విద్యార్థినుండి
ఎలాంటి విపత్తు పొంచివుందో
నన్న భయం నిలువెల్లా కమ్ముకుంటుంది. 

ఈ పరమపోకిరీలకు 
నిత్యం 
రకరకాల ఉద్వేగాలతో ఊగిపోయే విద్యార్థులకు పాఠాలు చెప్పడం కన్నా 
పచారీ కొట్టులో పద్ధులు వ్రాయడం ఉత్తమం అని అనుకుంటున్నారు గురుదేవుళ్లు

(ఒక గవర్నమెంట్ స్కూల్ లో పదవతరగతి విద్యార్థి 
గురువు తండ్రి స్థానంలో ఉండి 
ఒక మాటంటే పడకుండా చేయిచేసుకున్న దృశ్యాలను చూసి కలతచెంది వ్రాసాను)


కామెంట్‌లు