అంతా
హడావుడి ఆర్భాటం
డాబుదర్పంకొందరిది
దయనీయత
మరికొందరిది
కాలాతీతమై
కొందరిలో
హెచ్చిన బీపి
మరికొందరిలో
డౌనైన షుగర్ లెవెల్స్
ప్రధాన వేదిక పై
గానం చేయలేని
కవికోకిలలు
శాలువా జ్ఞాపికలతో సన్మానం
మమా అంటూ ముగింపు తంతు
పూర్తి చేసిన
మాన్యులు ప్రముఖులు
ఎన్ని వ్యయప్రయాసలు కోర్చి వచ్చిన
తొందరపడ్డప్పటికి కూయలేని
ఉగాది కోయిలలు
సర్దుకుపోదాం రండి
అన్న సహచరులు
మరొకమారు ఇలా జరగరాదంటున్న
కవులు, కవయిత్రులు
కవులు ఆగ్రహించగలరు
కవులు అనుగ్రహించగలరు
కవుల ప్రజలెన్నుకొనని
ప్రజాప్రతినిధులు
సమాజానికి చైతన్య గవాక్షాలు
కవులు సమాజానికి దిక్సూచిగా
నిలిచేవారు
సర్దుకుపోదాంరండి (కూయలేని కోయిలలు)- అంకాల సోమయ్య -దేవరుప్పుల-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి