ఏదేశపు వాణిజ్యపుకుట్ర : - అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ-9640748497
ఏం జరుగుతుందో తెలియదు 
నా వాళ్ళెక్కడున్నారు తెలియదు
ఊర్లకూర్లే వల్లకాడులై
పిల్లలు వయోవృద్ధులు 
రోగ గ్రస్తులు చెల్లాచెదురైన
భీతావహాదృశ్యం
ఏ ఆధిపత్యపుఅహంకారమో!?
ఏ మారణాయుధపు భయోత్పాతం
ఏ లక్ష్యసాధనకోసం 
ఈ దమనకాండ 
ఈ యుద్ధమేఘం 

ఏ దేశపు వాణిజ్యపుకుట్ర కోణం 
ఈ అసంబద్ధపు శతృత్వం 

ఏ దేశపు ఆశయసాఫల్యం
మానవవనరులను తుదముట్టించే నరమేధం 

చమురు దోపిడీ సూత్రమా!? 
ఆయుధాలు విక్రయమునకై
భయానకపు ప్రళయ గర్జన

ప్రపంచానికే పెద్దన్న దేశపు
పేరాశే బుద్ధే
ఈ ఆయుధ(కృత్రిమ)పోరా!?

విజ్ఞానం హెచ్చెనేని విశ్వశాంతి వర్థిల్లునుగా
ధనదాహం యుద్ధం కాంక్ష 
ఏ ఫలమాశకు ప్రతీకో గదా!?

ఐరాస చర్చచేయదా దేశాలకు
పెద్ద దిక్కై
భారతదేశం శాంతి సౌధం 
విఘాతమ్మును సహించబోదు

శాంతి చర్చలు జరపవలయు
కుత్సితాలు దూరంకావలయు
ఎల్లలోకం ఒక్క ఇల్లై
ఆధిపత్యములెల్లకల్లై
శాంతి సౌఖ్యం సమరసభావం 
వర్థిల్లెనేని
భూలోకమే స్వర్గమౌను 
సుఖశాంతులు సొంతమౌను

కామెంట్‌లు