కాలంతోనే కలిసిసాగుతాను:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
కాలంతోనే కలిసిసాగుతాను 
విడిపోవడం అంటే
నేను శాశ్వతమైన విరామం తీసుకోవడమే కదా!?

నాతో ఎవరూ రారూ
నా ప్రాణదీపం కొండెక్కినప్పుడు
నేనో జ్ఞాపకంగా మిగిలిపోతానంతే!?

నేను నా శైశవ, బాల్యం ,కౌమార యవ్వన దశల్లో 
కాలం నాతో  మల్లె తీగలా అల్లుకుంది

ఊరు వాడకు నా ఆచూకీ లభించలేని 
సమయమాసన్నమై ఇక అనువైన కాలాన్ని కోరుకోవడం 
ఆశనిపాతమే కదా!

ఊరొదిలి ,మన పేరొదిలి ,
జన్మనిచ్చిన తల్లి దండ్రులు నొదిలి ,
ఆప్తులైన ప్రాణ స్నేహితులనొదిలి,
వెనక్కి తిరిగి చూసేసరికి 
మృత్యువు కౌగిట్లోకి ప్రయాణమై
ఏదీ గుర్తుకు రాని 
మతిమరుపుతనం.

గతం లేదు భవిష్యత్తు లేదు 
వర్థమానం కనుమరుగౌతున్న
తరుణం
దేహం అనంత వాయువుల్లో కలిసిపోతుంది
ఆత్మ తత్త్వమే
మన ఆనవాలుగా మారి
మనల్ని భూమ్మీద చిరంజీవులుగా చేస్తుంది

కామెంట్‌లు