వర్తమానం కాకూడదు ఆశనిపాతం : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
గతం మిగిల్చిన గాయం 
భవితకై సంధిస్తున్న ప్రశ్నావళులు

వర్థమానం అభివృద్ధిమంత్రం
ఈముక్కాలాలసమాహారమే
జీవితం

సకలప్రాణికోటి జీవనయానం 
జాగృతావస్థే జీవనగమనం

భ్రమలు తొలగితేనే వాస్తవాలు తేటతెల్లం 
జీవనాభివృద్ధిసూచిక కర్మానుసారమే

మనిషి ఒక జ్ఞానయంత్రం
అజ్ఞానంతొలగిననాడు తానే 
ఒక విజ్ఞాన సర్వస్వం 

త్రికాలాల్లో సంచరించు మనిషి
యద్భావం తద్భవతి 
స్పర్థ ఆరోగ్యవంతమైనదైతే
సమైక్యం ,సమభావం ,
సామరస్యం ద్విగుణీకృతం 
భవిష్యత్తు వివేకవంతుడి
హస్తగతం 
వర్థమానం కాకూడదు ఆశనిపాతం


కామెంట్‌లు