సుందర జీవనంలో అద్భుత వసంతం: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
 ప్రకృతిలో ప్రతి అంశమూ కవితాత్మకమే,ప్రతి పనీ సుందర లయాత్మకమే.ప్రతిభతో నిమిత్తంలేని స్పందన సామాజిక చింతన ముఖ్యం. అయితే మన కాలుకు దెబ్బ తగిలితేగాని గాయం గురించి మాట్లాడని ప్రపంచంలో జీవించే మనిషి ఆలోచన స్వార్థ కేంద్రమైన వచ్చే ప్రమాద ఫలితం.సరిగ్గా అదే మన శరీరంలోని అవయవాల పరిస్థితి . మెదడు సరిగా తగిన సమయానికి స్పందిస్తే చాలా సమస్యలు మనిషిలో బిగిసిన పిడికిలి. రోగికి చికిత్సలో అవగాహన కిటికీలు తెరువడం కూడా వైద్య ధర్మం.ఆ చైతన్యం ప్రతి మనిషిలో  కలిగితే మనం కలలుగనే సంపూర్ణ ఆరోగ్య సమాజం మనదే. నేడు ప్రపంచ మూత్రపిండ దినోత్సవం,(అదే వరల్డ్ కిడ్నీ డే).పుట్టిన రోజులా గుర్తుపెట్టుకునేలా,ముందస్తు జాగ్రత్తకు ఒక సూచిక ఇది.బ్రెయిన్, కిడ్నీ,లివర్, హార్ట్,ఇవి లైఫ్ సేవింగ్ వైటల్ ఆర్గాన్స్.పరస్పర అవగాహన, సంబంధాలో మనిషిని నిత్యం కాపాడేవి.ప్రతి సంవత్సరం మార్చి 12న ప్రపంచ కిడ్నీ దినోత్సవం. కిడ్నీ వ్యాధులు రోజురోజుకూ ఎక్కువగా ఉండడం సామాజిక అప్రమత్తతకూ, ఆందోళనకు దారి తీస్తుంది. తరుచుగా వైద్య సలహాలు తీసుకొని సరైన చికిత్స,ఔషధాలు అందుకోవడం ముఖ్యమైన ప్రధాన అడుగు.సొంత వైద్యంతో కిడ్నీ పనితనానికి విఘాతం కలిగి, దాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగి, మందులు, డయాలసిస్ వంటి వైద్యచికిత్సలు దాటి వ్యాధి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు దారి దీయవచ్చును.ఉదాసీనత,నిర్లక్ష్యం మన ఆరోగ్యపరిరక్షణలో   ప్రధాన తిరోగమన శక్తులని గమనించాలి.
'చిక్కుడు గింజ' పరిమాణంలో  నడుము దగ్గర,వెనుక ఛాతిభాగం కింద ఉదరంలో ఇరువైపుల ఉండే రెండు అవయవాలు.లక్ష నెఫ్రాన్స్ తో ప్రతి కిడ్నీ రక్తశుద్ది వాటి పని.ఇది విషపదార్థాలను బయటికి పంపే చాలా సున్నితమైన అవయవం. అందుకే ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం కూడా. వైద్యుడు కవి అయితే కవితాత్మకంగా చెప్పొచ్చు.కానీ కవి వైద్యుడవడం అరుదైన గొప్పమాట.రోగిగా అనుభవం పొందిన కవి విన్నవి కన్నవి అనభవించినవి చెప్పొచ్చు కానీ వైద్యవృత్తి లోతుల్లోకి వెళ్లడం కష్టం. వైద్యపరంగా సున్నితమైన కేశనాళికల వడపోతతో రక్తశుద్ధి మలినాలు విసర్జన జరుగుతుంది. వ్యాధులు దాడి చేస్తే పనితనం తగ్గడం నెమ్మదిగా క్రమక్రమంగా హెచ్చరిస్తుంది.కానీ రోగి పసిగట్టి స్పందించడలో విఫలమైతే దీర్ఘకాలిక వ్యాధి  సి.కె.డి గా నిర్ధారణైతే డయాలిసిస్,కిడ్నీ మార్పిడి ఆఖరి అస్త్రంగా ఉపయోగించాలి. అదే కాకుండా అనువంశికంగా బహుళ కిడ్నీ నీటికంతులు 'పాలీ సిస్టిక్ కిడ్నీ' మెత్తం కిడ్నీలలో వ్యాపించి పని చేయవు.అది అలసట,బి.పి వంటి కొన్ని లక్షణాలతో హెచ్చరిస్తుంది.కాని స్పందనలో ఆలస్యంచేత కిడ్నీ మార్పిడి తప్పని పరిస్థితి కలుగవచ్చు. అప్పుడు ఎమర్జెన్సీ అటెన్షన్ లో ఆగమాగం అనవసర హైరానా.అందుకే అవగాహన కేంద్రాలు,సదస్సులు,వైద్య నిబద్ధత,మానవీయ కోణంలో వైద్యం వంటివి కొన్ని తక్షణ చర్యలతో రోగికి సుఖజీవనం అందించే వీలున్నది.అలాగే కిడ్నీ సంబంధ వ్యాధుల మూలం డయాబెటిస్,రక్తపోటు వంటి వ్యాధుల పీరియాడికల్ చెకప్స్ ఎంతో ఉపయోగం.అందుకే 'చికిత్స కన్నా వ్యాధి నిరోధక చర్య మంచిది' (ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్) గొప్పదన్నారు మన పెద్దలు.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(నేడు12 మార్చి 2026న 'ప్రపంచ కిడ్నీ డే' సందర్భం)
కామెంట్‌లు