పుస్తకాలు మంచి మిత్రులు :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
పుస్తకాల మెట్లపై 
జీవితంలో ఎదగాలి 
విజ్ఞానపు నేత్రంతో 
ప్రపంచాన్ని చూడాలి 

పుస్తకమే కావాలి 
మళ్ళీ హస్త భూషణము 
చరవాణికి కాసేవు 
విరామమే ఇవ్వాలి 

పుస్తకాల తోటలో 
అక్షరాల కోటలో 
అనుదినము గడపాలి 
ఆనందమే పొండాలి 

పుస్తకాలే స్నేహితులు 
బ్రతుకున శ్రేయోభిలాషులు 
చూడాలోయ్! ప్రేమగా 
చదవాలోయ్! ఇష్టంగా 


కామెంట్‌లు