త్యాగమయి క్రొవ్వొత్తి: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
క్రొవ్వొత్తి త్యాగము 
పరికింప అసమానము 
ఇలలో జీవకోటికి 
అత్యంత ఆదర్శము 

కాంతినిచ్చు కరుగుతూ
చీకట్లను తరుముతూ 
ప్రత్యేకత చాటుకొనును 
క్రొవ్వొత్తి సాయపడుతూ 

క్రొవ్వొత్తిలా ఉందామా 
పరోపకారం చేస్తూ 
బ్రతుకులో వెలుగుదామా 
మంచినే పంచేస్తూ 

ఈ జన్మను సార్ధకము 
భువిని చేసుకుందాం 
క్రొవ్వొత్తి రీతిలో 
ఉన్నంత వరకు జగతిలో 


కామెంట్‌లు