సత్యమే కదూ!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
గుణం లేని రూపము 
నూనె లేని దీపము 
పరికింపగ వ్యర్థము 
కసాయిల స్వభావము 

మోసగించు అందము 
మూర్ఖులతో బంధము 
తెచ్చిపెట్టు నష్టము 
జీవితాన కష్టము 

మితిలేని ఆవేశము 
వేగంగా నడపడము 
రెండూ హానికరము 
మానితే ప్రయోజనము 

కఠినమైన హృదయము 
కర్కశ మనస్తత్వము 
బ్రతుకులో అనర్ధము 
లేదు అందు లాభము 


కామెంట్‌లు