అమ్మ మేటి మాటలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
ప్రతి వారిని గౌరవించు 
తప్పకుండా వ్యక్తిగా 
భగవంతుని పూజించు 
అనంతమైన శక్తిగా 

నమ్మిన ఎవరినైనా 
వెన్నుపోటు పొడవరాదు 
వయసులో చిన్నయైనా 
ఎగతాళి చేయరాదు 

సృష్టిలో ఏదైనా 
భావించు ఉన్నతంగా 
పొరపాటు ఎవరిదైనా 
క్షమించు హుందాగా 

కోల్పోకు వ్యక్తిత్వము 
ఎట్టి పరిస్థితిలోనూ 
విడవకు మానవత్వము 
చివరి నిమిషంలోనూ 


కామెంట్‌లు