పరీక్షలంటే చాలామంది భయపడడం సహజం. ఏడాదంతా చదివి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే పిల్లలు కొంతమేరకు మానసిక ఒత్తిడికి గురవుతారు. పరీక్షలంటే భయపడిపోతున్నారు. సమయపాలన, సరైన ప్రిపరేషన్, చక్కని ప్రణాళికను అమలు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే పరీక్షల భయమనేది ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయుడు, మోటివేషనల్ స్పీకర్ ఈర్ల సమ్మయ్య పిల్లల ప్రయోజనం కోసం పలు సూచనలు చేశారు.
పరీక్షల భయానికి కారణాలు
👉 సరైన పరీక్షల సంసిద్ధత, ఆత్మవిశ్వాసం, సమయపాలన లేకపోవడం. పరీక్షా సమయాన్ని సక్రమంగా ఉపయోగించలేనేమోననే భావన.
👉 ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం.
👉 తాము చదివింది బాగా గుర్తుండదేమో, పరీక్షలు సరిగా రాయలేనేమో అనే భావనలు, ఆలోచనలు పిల్లల్లో రావడం.
👉 ఇతరులతో పోల్చుకోవడం, స్నేహితులు, తోటి వాళ్లు బాగా చదువుతున్నారు. బాగా రాస్తున్నారు. నేను వారిలాగా పరీక్షలు బాగా రాయలేనేమో అనే నెగిటివ్ భావనలు పిల్లల్లో రావడం.
👉 గత పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం లేదా ఫెయిల్ కావడం వల్ల మళ్ళీ అదే పునరావృత్తమవుతుందేమోననే
పరీక్షల భయం పోవాలంటే.....
👉 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు మొదటి నుంచి సరైన సమయసారినిని తయారు చేసుకోవాలి. ప్రణాళిక బద్ధంగా, క్రమం తప్పకుండా ప్రతిరోజు చదువుతూ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
👉 పెద్ద టాపిక్స్ ని చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవాలి.
👉 చదివిన పాఠ్యాంశాలను ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు రివిజన్ చేస్తే, అవి బాగా గుర్తుండిపోతాయి. చదవడం ఎంత ముఖ్యమో, రివిజన్ చేయడం Kbhi అంతే ముఖ్యమని భావించాలి.
👉 పరీక్షల సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. పరీక్షలు ఉన్నాయని, బాగా రాయాలని, రాత్రింబగళ్లు నిద్రపోకుండా చదివితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నిద్రలేమి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత కరువవుతుంది. దీంతో భయం, టెన్షన్ పెరిగి పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
👉 పరీక్షలు బాగా రాయాలంటే రాత్రి కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్ర అవసరం. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు సరిపడినంతగా తీసుకోవాలి. బయటి ఆహారం, జంక్ ఫుడ్ వంటివి తీసుకోకపోవడం మంచిది. రోజురోజుకు ఎండలు ముదురుతున్నందున ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటే బాగుంటుంది.
👉 రోజు ధ్యానం, యోగ, కొద్దిపాటి నడక అనేవి మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుగా పనిచేసేలా తయారు చేస్తాయి. దీంతో పరీక్షల భయం తొలగిపోతుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు.
👉 పరీక్షల సమయంలో ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మనసులోకి వ్యతిరేక భావనలు, ఆలోచనలు రానీయకూడదు. నేను పరీక్షలన్నీ 'బాగా రాయగలను' అనే ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలి. ఇలా తమ పట్ల నమ్మకం పెంచుకుంటూ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి.
👉 అందరి సామర్థ్యం ఒకేలా ఉండదు. కొందరికి ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయి. అలాంటి వారితో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు. మనకుండే సామర్థ్యాలు మనకు ఉంటాయి. ఏకాగ్రత, దృఢ సంకల్పం, ప్రణాళిక బద్ధమైన, క్రమానుసారమైన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలి.
👉 సాధనా పరీక్షలు( మాక్ టెస్టులు), గతంలోని ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల సమయ నిర్వహణ అలవాటవుతుంది. దీనివల్ల సకాలంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతారు.
👉 చక్కగా ప్రిపేర్ కాకుండా నేను పరీక్షలు బాగా రాయాలనే ఆతృతను అధికంగా పెంచుకోవడం వల్ల, దాని మీదనే ఆలోచనలను కేంద్రీకరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. సమాధానం తెలియని ప్రశ్నల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. వాటిని వదిలేసి, మొదట బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం రాయాలి. తర్వాత తెలియని ప్రశ్నలకు సమాధానం గుర్తు తెచ్చుకుంటూ రాయడానికి ప్రయత్నించాలి. ఈ సూచనలను జాగ్రత్తగా పాటిస్తూ పరీక్షలు రాస్తే, పిల్లలు అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి