తల్లిగర్భంలో పడినపుడు గర్భస్థ శిశువు పడే సంఘర్షణపుడమిపై పడినపుడు ఆకలికై పడే ఆరాధన.బాల్యంలో అమ్మ నాన్నల ప్రేమకై ఆరాటంవిద్యార్థిగా పరీక్షలో ఉత్తీర్ణతకై పోరాటం.ఉత్తీర్ణత అనంతరం ఉన్నతచదువులకై ప్రయత్నంతదుపరి చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుందా రాదా అనే మానసిక బాధ.ఉద్యోగం తరువాత అనుకూల భాగస్వామి రావాలని ప్రయత్నంవివాహామై సంస్కారయుత సంతానంకై పడరానిపాట్లు.వృద్ధాప్యంలో శరీరం సహకరించక,అనురాగ ఆప్యాయతలు అయినవారు చూపక పోతే కలిగే బాధ.ఎన్నని చెప్పను ఏమని చెప్పనుజీవితమే సంఘర్షణల మయం.సంఘర్షణలతో పోరాడి అనుకున్నది సాధిస్తేజీవితం సాఫల్యతచెందినట్లేఅందుకే సంఘర్షణల జీవితం పరిపూర్ణత్వానికి ప్రతీకలు..!!............................
సంఘర్షణే జీవితం: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి