గూటిలోని చిలకమ్మా
రెక్కలు విప్పి లేవ మ్మా
కొమ్మమీద వాళ్ళమ్మ
కిందికి నీవు చూడమ్మా
చిన్నారి పిల్లలొచ్చారు
చెట్టు కింద చేరారు
పుట్టమన్ను తెచ్చారు
బొమ్మరిల్లు కట్టారు
బొమ్మలు కొన్ని పెట్టారు
నిమ్మలంగా ఉన్నారు
కొమ్మను నీవు ఊపమ్మ
పండ్లు అన్ని రాలును
పక్కకు ఏరీ పోస్తారు
ఆటలాడుతూ పిల్లలు
తీయని పండ్లు తింటారు
హాయిగా వారు ఉంటారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి