ఏరై పారె ఈ జీవితంలో
కలిసే బంధాలెన్నో
నిలిచే స్నేహలెన్నో....
మనసును నింపేవి కొన్ని
మమతలు పంచేవి కొన్ని
మాయని ఊపిరిగా ...కొన్ని
వెన్నెలగా ఆహ్లాదం
కన్నులలో సంతోషం
తలచినంతనే ఇచ్చేవి.....
తెలియని వేదనగా
కరగని జ్ఞాపకమై
ఇగిరిపోని గంధంలా నిలిచేవి..
కదిలిపోయే కాలంలో
కరిగిపోక మిగిలే....
కమ్మని స్నేహాలు కొన్ని...
ఆనందంలో ఆప్తంగా
ఆవేదనకు ఆసరాగా
ఆలోచనలో సొంతంగా తోచేవి...
ఎదలోపలి గదుల పొరల
అడుగున అపురూపంగా దాగి
మదికి దగ్గరగా మసిలేవి...
పెదవి పలకని రాగంలా
కనులు మరవని కలలా
వెంటాడి వేటాడేవి...
వేకువలా పలకరించి
వేడుకగా బ్రతుకు మార్చి
వెలలేని మధురిమ పంచే...
స్నేహలకు.... శుభమంటూ...
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి