ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము- 213 వ రోజు
శ్రీకృష్ణుడు కౌరవుల తప్పులను ఎత్తి చూపుట
సంజయుడు " కృష్ణా! నీవే ఇలా మాట్లాడితే సంధి ఎలా పొసగుతుంది? " అన్నాడు. శ్రీకృష్ణడు " ఆ రోజు సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు నోరు మెదిపారా? కుమారుల అకృత్యాలను దృతరాష్ట్రుడు ఆపగలిగాడా! దుశ్శాసనుడు వదిన అని చూడక ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకు వస్తుంటే మామగారైన దృతరాష్ట్రుడు ఎలా సహించాడు ఆమె ఏడ్పులు వినిపించ లేదా ? విని ఓర్చుకున్నాడా! ఇప్పుడు తగుదునమ్మా అని పాండవుల యోగక్షేమం కనుక్కుని రమ్మన్నాడా! భార్యను అవమానిస్తుంటే పాండవులు మిన్న కున్నారు. ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బ్రతికి పోయారు లేకుంటే ఆరోజే చచ్చి ఊరకుండే వారు. పాండవులు ఎల్ల కాలం ఇలాంటి అవమానాలను సహించి ఊరకుండవలసినదేనా ! సభలో కర్ణుడు " జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు కనుక వారు ఉండీ లేనట్లే . కనుక సభలో నీకు నచ్చిన వారిని భర్తగా ఎంచుకో అనలేదా ! " శూలాలలా ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలవదా? దుశ్శాసనుడు " ఇక్కడ రోషం ఉన్న మగాడెవరు? నీకు భర్తలు ఉండీ లేనట్లే " అన లేదా? పాండవులు అప్రయోజకులే అయినా అలా మాట్లాడటం వలన వారికి కలిగిన మేలు ఏమి? ఆ తరువాత జరిగినవి సభలో చెప్పతగినవి కాదు. ఈ సంధి పొసగదు. అయినా పాండవులకు నచ్చ చెప్పి నేను ఒప్పించి హస్థినకు వస్తాను. కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్య భాగం వారికిమ్మని అడుగుతాను ఇస్తారా బ్రతికి పోతారు. ఏమైనా కుటిలోపాయం చేసారా పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం కావడం తథ్యం. అలా జరగదని ఆశిస్తున్నాను. సంజయా! సుయోధనుడు రోషంతో కూడిన మహా వృక్షం.దానికి కాండం కర్ణుడు, కొమ్మలు శకుని ఫల పుష్పాదులు దుశ్శాసనాది సోదరులూ ఇతరులు దానికి మూలం దృతరాష్ట్రుడు. అలాగే ధర్మరాజు ధర్మము అనే మహావృక్షం దానికి అర్జునుడు కాండం భీముడు శాఖోపశాఖలు ఫలపుస్పాలు నకుల సహదేవులు ఈ వృక్షానికి మూలం సద్భ్రాహ్మణులు, వేదములు. నిష్పక్షపాతంగా యోచించి రెండింటిలో ఏది మేలో నీవే చెప్పు. పుత్రులతో కూడిన దృతరాష్ట్రుడు ఒక మహారణ్యం. పాండుపుత్రులు అందులో సంచరించే సింహాలు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవి లేక సింహాలు మనజాలవు. కనుక రెండు ఒకరిని ఒకరూ ఆశ్రయించుకుంటే అందరికీ మేలే. నేను హస్తినకు వస్తాను దృతరాష్ట్రుడు పాండవులను కుమారులలా ఆదరిస్తే వారు కౌరవులను అనుసరించి ఉంటారు.నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని దృతరాష్ట్రుడికి నికి చెప్పు " అన్నాడు.
ధర్మరాజు కౌరవుల ప్రముఖులకు ప్రణామములు చెప్పుట
సంజయుడు " నేను వచ్చిన పని సఫలం అయిందని ఆశిస్తాను " అని దృపదాదులను చూసి " నాకు అనుజ్ఞ ఇస్తే నేను పోయి వస్తాను . ధర్మజా! నా పలుకులలో తప్పేమి లేదు కదా? " అన్నాడు. ధర్మరాజు " సంజయా! నీ పలుకులలో అనుచితంలేదు అధర్మమైన మాటలు నీవు చెప్పవు కదా! నీ ఓర్పు నేర్పు ఎవరికి ఉంటాయి చెప్పు. నీవు హస్థినకు పోయి తాత భీష్మునకు , గురువు ద్రోణునకు, కృపాచార్యునకు నా నమస్కారాలు అందచెయ్యి. మా తండ్రి దృతరాష్ట్రునికి నమస్కరించానని చెప్పు . దుర్యోధనుని సోదర సమేతంగా క్షేమమడిగానని చెప్పు. విదురుని , శల్యుని వినయంగా అడిగినట్లు చెప్పు. అశ్వద్దామను అక్కున చేరుకున్నానని చెప్పు. బాహ్లికుని, సోమదత్తుని ప్రియంగా పలుకరించానని చెప్పు. కర్ణుడు, శకుని, సైంధవుడు, కృతవర్మలకు వృద్ధులైన రాజులకు మాతో యుద్ధం చేయ సిద్ధమైన సకల రాజులకు ఎవరికి తగినట్లు వారికి సముచిత రీతిలో వినయంగా, వాత్సల్యంగా, బంధుప్రీతిగా నా ప్రణామములు అందచెయ్యి. శత్రువులను జయించి మేము దాసదాసీ జనములను ఉదాసీనపరచకుండా ఆదరించగలమని చె
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి