నా పెరట్లో ఉన్న పిల్లి
ఎదురింటి తలుపు నెట్టి పాలు దొంగిలించి ఆకలి తీర్చుకుంది.
ఆ ఇంటి యజమాని
వీధిలో తిరుగుతున్న ఆవు నుంచి
దొంగతనంగా పాలు పితికాడు.
ఆ ఆవేమో ఆ సమయంలో
గోడమీద అతికించిన ‘కన్నీటి అంజలి’ పోస్టర్‌ను తింది.
కన్నీటి అంజలి పోస్టులో ఉన్నతను తన తల్లికి
అబద్ధం చెప్పి తాగి వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఇలా గొలుసుకట్టులా సాగిన ఈ ఘటనలు అన్నీ ముడిపడి ఉన్నాయి.
పిల్లి పులిగా మారుతుంది
పులి పిల్లిగా మారుతుంది అనేదంతా పాత కథ.
ఏడు సముద్రాలు,
ఏడు జన్మలు వంటి కథలన్నీ
అనంతం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి