నాదిప్పటికీ ప్రశ్నే
నేను వర్షానికా
లేక
ఎండకా...
ప్రపంచంలో
మొదటి గొడుగు చెట్టు కొమ్మలేనట....
చరిత్ర మాటల బట్టి
ఎండలో నీడనివ్వడానికి
రూపుదిద్దుకున్నవాడిని
ఆదిలో నేను
రాజులకు మాత్రమే పరిమితమైన
ఓ గొప్ప వస్తువుగా పరిచయమయ్యాను
చైనీయులు
తొలుతగా మొదటి గొడుగును
ఓ క్రమంలో తయారుచేశారట
ఇటలీ దేశస్తులు నన్నో అలంకార వస్తువుగా
రూపొందించారు...
ఏడు వందల సంవత్సరాల క్రితం
నీటిని పీల్చేసే ఓ పరికరంగా నన్ను వానకు సైతం
ఉపయోగించడం మొదలుపెట్టారు.
నామీద రకరకాల బొమ్మలు ముద్రిస్తారు
కొత్త కొత్త వర్ణాలు
కొత్త కొత్త డిజైన్లు
నన్ను మహిళలకు చేరువ చేస్తుంటుంది....
మనుషుల అభిరుచులతోపాటు
గుణాలను గొడుగులు వెల్లడిస్తాయి
ఓ గొడుగులో ప్రియులిద్దరు
కలిసి అడుగులు వేయడానికి తోడ్పడే నేను
సముద్రతీరపు ఇసుకతిన్నెలపై
నా చాటుమాటున సరసాలాడుకోవడానికి
ముందువెనుకలు ఆలోచించరు
వయోధికుల మూడో కాలుగానూ
నేను పనికొస్తాను...
చిన్నపాటి జల్లులు మొదలయ్యాయో లేదో
గొడుగులు తీస్తారు
ఆకాశం నుంచి నేలను ముద్దాడడానికి
పడే వానజల్లులను నాతో అడ్డుకునే వారంటే
నాకు కొంత కోపమే...
దేవుడి మొదలుకుని ప్రేమికుల వరకూ
రాజుల నుంచి మహిళల వరకూ
నా చేయి పట్టుకున్నా
రోడ్డుపక్కన పరచిన చిరిగిన గొడుగులో
పడుకున్న వారిని చూసినప్పుడు
నా పుట్టుకేంటో బోధపడుతుంది
చాలా మందికి నేను గొడుగును
కొందరికి నేను గూడుని
నన్ను విప్పి మళ్ళీ ఠపీమని మడిచిపెట్టేటప్పుడల్లా
నాలోపలి కమ్మీలన్నీ ఎంత నలిగిపోతాయో తెలుసుకోండి
నన్ను మెల్లగా వాడటానికి ప్రయత్నించండి
నేను వర్షానికా
లేక
ఎండకా...
ప్రపంచంలో
మొదటి గొడుగు చెట్టు కొమ్మలేనట....
చరిత్ర మాటల బట్టి
ఎండలో నీడనివ్వడానికి
రూపుదిద్దుకున్నవాడిని
ఆదిలో నేను
రాజులకు మాత్రమే పరిమితమైన
ఓ గొప్ప వస్తువుగా పరిచయమయ్యాను
చైనీయులు
తొలుతగా మొదటి గొడుగును
ఓ క్రమంలో తయారుచేశారట
ఇటలీ దేశస్తులు నన్నో అలంకార వస్తువుగా
రూపొందించారు...
ఏడు వందల సంవత్సరాల క్రితం
నీటిని పీల్చేసే ఓ పరికరంగా నన్ను వానకు సైతం
ఉపయోగించడం మొదలుపెట్టారు.
నామీద రకరకాల బొమ్మలు ముద్రిస్తారు
కొత్త కొత్త వర్ణాలు
కొత్త కొత్త డిజైన్లు
నన్ను మహిళలకు చేరువ చేస్తుంటుంది....
మనుషుల అభిరుచులతోపాటు
గుణాలను గొడుగులు వెల్లడిస్తాయి
ఓ గొడుగులో ప్రియులిద్దరు
కలిసి అడుగులు వేయడానికి తోడ్పడే నేను
సముద్రతీరపు ఇసుకతిన్నెలపై
నా చాటుమాటున సరసాలాడుకోవడానికి
ముందువెనుకలు ఆలోచించరు
వయోధికుల మూడో కాలుగానూ
నేను పనికొస్తాను...
చిన్నపాటి జల్లులు మొదలయ్యాయో లేదో
గొడుగులు తీస్తారు
ఆకాశం నుంచి నేలను ముద్దాడడానికి
పడే వానజల్లులను నాతో అడ్డుకునే వారంటే
నాకు కొంత కోపమే...
దేవుడి మొదలుకుని ప్రేమికుల వరకూ
రాజుల నుంచి మహిళల వరకూ
నా చేయి పట్టుకున్నా
రోడ్డుపక్కన పరచిన చిరిగిన గొడుగులో
పడుకున్న వారిని చూసినప్పుడు
నా పుట్టుకేంటో బోధపడుతుంది
చాలా మందికి నేను గొడుగును
కొందరికి నేను గూడుని
నన్ను విప్పి మళ్ళీ ఠపీమని మడిచిపెట్టేటప్పుడల్లా
నాలోపలి కమ్మీలన్నీ ఎంత నలిగిపోతాయో తెలుసుకోండి
నన్ను మెల్లగా వాడటానికి ప్రయత్నించండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి