మానస ఆర్ట్స్ ఉగాది ప్రతిభా పురస్కారం
వివిధ రంగాలలోని సాహితీ ప్రముఖులకు శ్రీ పరాభవనామ ఉగాది ప్రతిభా పురస్కారాల మహోత్సవం హైదరాబాద్ మానస ఆర్ట్ థియేటర్స్ మరియు జి ఎస్ ఆర్ మరియు ఫ్రెండ్స్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం లలిత కళా వేదిక శ్రీ త్యాగరాజ గాన సభ చిక్కడపల్లిలో ఘనంగా జరిగింది. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లలిత వాణి సభకు అధ్యక్షత వహించగా,మానస సలహాదారులు శ్రీ బి ఎస్ రావు ముఖ్య అతిథిగా ప్రముఖ కవయిత్రి డాక్టర్ పద్మా నాగరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. మానస ఆర్ట్ థియేటర్స్ వారు సాహితీ సేవలో ఇంతవరకు వివిధ రంగాలలో సాహితీ సేవ చేస్తున్న ప్రముఖుల సాహితీ సేవలను గుర్తించి దాదాపుగా 2000 మందికి సన్మానాలు చేసినట్టు ప్రధాన కార్యదర్శి రఘుశ్రీ తెలియజేశారు.
విశిష్ట అతిథి డాక్టర్ పద్మ నాగరాజు శ్రీ పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరిస్తూ పరా అంటే పార్వతీదేవి భవ అంటే శివుడు పార్వతి శివరూపమైన ఈ సంవత్సరం అందరికీ శుభకరం అని వివరిస్తూ పరాభవమే లేదు అని వివరించారు.
ప్రముఖ కవి, విశ్రాంత జర్నలిస్ట్, ఆధ్యాత్మిక సాహితీ వ్యాసభూషణ్ "కావ్యసుధ " 56 సంవత్సరాలుగా సాహితీ రంగంలో వివిధ పార్ష్వాల్లో రచనలు చేస్తూ, మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలోని శిథిలమైన ప్రాచీన, ఆధునిక దేవాలయ చరిత్రలు, జాతీయ పండుగలు.. వివిధ రంగాల్లోని సేవలకు గుర్తింపుగా.. శ్రీ పరాభవనామ ఉగాది ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం 'కావ్యసుధ 'కు
తెలుగు సంప్రదాయ పద్ధతిలో
తలపాగా, నారీకేళం, తాంబూలం, జత ధోతి , పూలమాల, విలువైన శాలువాతో మెమెంటో తో ఘనంగా సత్కారం పొందారు.
ప్రముఖ రచయిత్రి ప్రపంచ పర్యాటకురాలు డాక్టర్ నర్మదా రెడ్డి ,ప్రముఖ రచయిత ఆధ్యాత్మికవేత్త శ్రీ సద్గురు దామోదరాచార్య, సీరియల్ దర్శకులు శ్రీ రాజ్ మురారి, రేడియో జాకి మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ మల్లేష్, వీరితో పాటు ప్రతిభా పురస్కారాలు పొందినారు.
పురస్కార గ్రహీత కావ్యసుధ స్పందనలో.... 2013-2014 మానస ఆర్ట్స్ ఉగాది ప్రతిభా పురస్కారాలను తిరిగి 12 ఏళ్ల తర్వాత మళ్లీ మానస వారి ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం సంతోషకరంగా ఉందని తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ ఘన సన్మానానికి తన సాహితీ సేవల గుర్తింపుకు సంస్థ ప్రధాన కార్యదర్శి రఘుశ్రీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు గంటల పాటు మనోహరంగా గాయనీ గాయకులు వివిధ చిత్రాల్లోని మరపురాని పాటలు ఆలపించి సభికులను తన్మయులను చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి