ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము- 215 వ రోజు
ద్వితీయాశ్వాసం
ఆ విధంగా సంజయుడు ధర్మజుని వద్ద శలవు తీసుకుని ఉపప్లావ్యం వదిలి హస్తినాపురం చేరాడు. ధృతరాష్ట్రుని అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిన చెంతన కూర్చుండ పెట్టుకొని జరిగిన విషయం వివరించమని అడిగాడు. సంజయుడు " మహారాజా! ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం అడిగాడు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " సంజయా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమేనా? అతని బంధు మిత్రులు అతని పట్ల ప్రీతితో మెలగుతున్నారు కదా " అన్నాడు. సంజయుడు " మహారాజా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమే. ధర్మరాజుకు దైవ చింతన మెండు కదా. అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు. పాప పుణ్యాలను నీమీద పెట్టాడు. నీవు నీ కొడుకు కోరినట్లే కాని వేరొక తీరుగాఆలోచించవు. అతడేమో కర్ణుడిని, శకునిని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు. కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరకుంటారా? లోకంలో ఎవరికీ కొడుకులు లేరా ? కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరయినా ఉంటారా? ప్రజలంతా నిన్నుపుచ్చిపోయేలా తిడుతుంటే విన లేక నా చెవులు పుచ్చిపోతున్నాయి. దుశ్శాసనుడు, శకుని మాత్సర్యంతో నిన్ను, దుర్యోధనుడిని బొమ్మలను ఆడించినట్లు ఆడిస్తున్నారు. పాండవులు మంచివారు కనుక సరి పోయింది. వారే విసిగిపోయి కోపిస్తే ఒక్క చిటికెలో మీరంతా ఈ సరికి నాశనం అయి ఉండే వారు. మనవాళ్ళు ధర్మరాజు శాంతగుణాన్ని పిరికితనం అనుకుంటున్నారు. అది పొరబాటు. పొట్టేలు కొండను చూసి, అది తనను ఢీకొనలేదు కనుక కొండ ఓడిపోయిందని ప్రకటించినట్టు ఉంది. ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు కనుక మీరు జీవించి ఉన్నారు. లేకుంటే ఈ సరికి మీరు ప్రాణాలతో ఉండే వారు కాదు. జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది. అప్పుడు నువ్వు ఉపేక్షించడం వల్ల మనసులను ఇప్పుడు కాల్చుతోంది. ధర్మరాజు మెత్తని పులి. ఏమీ ఎరగనట్టు ఉంటాడు. నీమీద అన్యాయం పెట్టేవరకు ఊరుకోడు. అటువంటి నిందపడిన తర్వాత ఆపడం నీతరం, నాతరం కాదు " అన్నాడు. సంజయుడు ఈవిధంగా చెప్పి, వేగంగా రావడం వలన అవయవాలు నొప్పిగా ఉన్నాయని, ప్రొద్దు పోయిందికనుక పొద్దున్నే వచ్చి అందరూ వింటూ ఉండగా సభలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెపుతాను అని వెళ్ళిపోయాడు.
ధృతరాష్ట్ర విదురుల ఆలోచన
ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడిని మందిరానికి పిలిపించి " విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. రేపు వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ చెపుతానని వెళ్ళాడు. అప్పటినుండి నా మనసు వికలమయింది. నిద్ర రావడం లేదు " అన్నాడు. విదురుడు " ధ్రుతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీనుడు, డబ్బు పోగొట్టుకొన్నవాడు, ఇతరుల డబ్బును దొంగలించాలని కాచుకున్న వాడు, కామంతొ మనసు కలతచెందిన వాడు నిద్రపట్టక అవస్థ పడతాడు. వీటిలో నీకు ఏ దోషం ఉంది. ఇతరుల సొమ్మును అపహరించి నీవు ఒక్కడివే అనుభవించాలని అనుకున్నావా. నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏమిటి చెప్పు" అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! ధర్మరాజు మనోగతం ఏమయి ఉంటుందో అవగతం కాక నిద్ర రావడం లేదు " అన్నాడు
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి