ఆయుధ కర్మాగారం విద్యార్థికి పురస్కారం


  55వ జాతీయ భద్రతా దినోత్సవమును పురస్కరించుకొని జాతీయ భద్రతా మండలి, హైదరాబాద్ విభాగం జనవరి 25 న రాష్ట్రవ్యాప్తంగా"భద్రత ఆరోగ్యం మరియు పర్యావరణం" అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలో మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దమ్మన్నగారి మనోహర్ ప్రతిభ కనబరిచి ప్రత్యేక పురస్కారం పొందాడు. ఈ సందర్భంగా బుధవారం నాడు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మనోహర్ కు పురస్కారం మరియు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ విషయాన్ని గైడ్ ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం కూడా ఈ విద్యార్థి బహుమతి పొందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, చవాన్ సుభాన్ సింగ్, సంధ్య, తల్లిదండ్రులు అభినందించారు.
కామెంట్‌లు