కిచ కిచ మని పెరటిలోన సందడి చేసేవి...!గింజలు,మెతుకులను ఏరుకుంటు తిరిగేవి...!!వాటిని చూసి,మేమెంతోసంబరపడిపోయే వాళ్ల0ఊర పిచ్చుక, బుల్లి పిచ్చుక,బుజ్జి పిచ్చుక అం టూ...వాటికి పేరులు పెట్టే వా ల్లం...!ముద్దొచ్చే ఆ పిచ్చుకలంటే మాకెంతో ఇష్టము...!వాటితో ఆడు తుంటె ఆకలినే మరిచేము...!!ఏ వీ ఆ పిచ్చుకలు , ఏదీ ఆ సందడి...!?అపు డెపుడో .... మా చిన్నప్పటి ముచ్చట్లవి...!నేడు ఎంత కావాలను కున్న... మరల తిరిగి రానివి..!!!మనిషి కేవలం , తన సౌల భ్య0 కోసం .... ,తన సుఖ, సంతోషాలకొరకే...చేసెను సహజ సుందర ప్రక్రుతినే వికృతం...!!అడవులన్నిఅంతరించె....కొండలెన్నొ కరిగి పోయె!చివరికి చిన్న చిన్న పక్షి జాతు లెన్నో అంతరించి పోయె నకటా....!!ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్లు.....!పిచ్చుకన్నది మచ్చుకైన కనిపించక నాశనం చేసె నహో..!!భూగోళమె అతి వేడితో జీ వ కోటిని మల మల మా డ్చే,అగ్ని గోళమైపోయె..!పిచ్చుక లారా.... ఇది మీ శాపమో...! మీ ఉసురు తగిలెనో ...,మాబ్రతుకులు ఈనాటికి కడు దుర్భర మై పోయినవి....!!*******
పిచ్చుక లారా: - ...కోరాడ నరసింహా రావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి