వర్ణం అనే మాట సంస్కృతానికి చెందినది. ఈ పదానికి వికృతి వన్నె. వర్ణానికి వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళలలో ప్రాధాన్యముంది. ముఖ్యంగా చిత్రలేఖనానికి వర్ణం ప్రాణాధారం. అటువంటి వర్ణపు పరిణామ స్వభావ, విశిష్టతలను శాస్త్రీయరీతిలో వివరించేదే వన్నెల సిద్ధాంతం.
సృష్టిలో చూపు గల వాటన్నిటికీ రంగు ప్రధానం. సర్వ శోభితమైన ఈ విశ్వానికి సృష్టికర్తగా ప్రత్యక్ష దైవంగా చెప్పుకునేది సూర్యభగవానుడినే. కనుక చిత్రకళారంగానికి సంబంధించినంతవరకూ రంగుల పుట్టుక, వాడుక గురించి కొద్దోగొప్పో తెలుసుకోవడం ముఖ్యం. జ్ఞానేంద్రియాలన్నిటిలో కళ్ళకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ వన్నెల సిద్ధాంతం తెలుసుకోవడానికి ఇంద్రధనస్సు ఆధారభూతమైంది. మనిషి ఈ ధనస్సును చూసి వివిధ వర్ణాలకు సంబంధించి స్థూలపరిజ్ఞానాన్ని కొంత వరకు తెలుసుకోగలిగాడు. వర్షం రానున్నప్పుడో వర్షం కురిసిన తర్వాతో వాతావరణాన్ని బట్టి ఇఁద్రధనస్సు ఏర్పడటావికి అవకాశం ఉంటుంది. ఇంద్రధనస్సులో ఉన్న రంగులు ఏడు. అవి, ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నీలలోహితం, ఊదా.
ఇంద్ర చాపం ఓ స్థిరమైన స్థలంలో ఏర్పడదు. పరీక్షించడానికి అనువైన రీతిలో స్థిరంగా ఉండదు. తెరపై పట్టడానికి వీలుండదు. అది కంటికి కలిగే వర్ణభ్రాంతి మాత్రమే.
ఇదిలా ఉండగా, సంగీతంలో వర్ణములు అనేవి వేరు. కర్ణాటక గానాభ్యసంలో స్వరపల్లవులను స్వరజతులను నేర్పిన తర్వాత విద్యార్థి అభ్యసించే రచనలను వర్ణములు అంటారు. ఇవి దాదాపు రెండు వందల దాకా ఉన్నాయి. తాన వర్ణం ముఖ్యంగా రెండు భాగాలు. అవి, పూర్వాంగం, ఉత్తరాంగం. పూర్వాంగంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరాలనే రాగాలుంటాయి. ఉత్తరాంగంలో చరణం, చిట్ట స్వరాలు అనే భాగాలుంటాయి.
వన్నెల సిద్ధాంతం: - - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి