సృష్ట్యాది యుగాదియై నిలువ
ప్రకృతి పులకించి మురిసింది.
తెలుగు లోగిళ్ళలో శోభతో,
మామిడి తోరణాల స్వాగతాలు.
తొలి పండుగ షడ్రుచులతో
జీవితాన్ని నడిపిస్తుంది.
పంచాంగ శ్రవణం మార్గాన్ని
సూచిస్తుంటే,
పెద్దల ఆశీర్వాదం అభయమిస్తున్నది.
ఆబాలగోపాలం మోదంతో,
భక్ష్యాలను భుజిస్తూ,
సంవత్సరాదిని ఆహ్వానిస్తున్నారు.
ఉడుపథం మానవాళి గమనాన్ని సూచిస్తుంటే,
ఆదిపర్వం సంస్కృతికి ఆలవాలమవుతున్నది.
వసంత నవరాత్రులు కొత్తసంబురాలకు వేదికై,
ఉగాది ఉర్విని ఆశీర్వదిస్తున్నది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి