రాత్రి గీసిన ఉహా చిత్రాలకు
రంగులేస్తూ వచ్చిన
రవికిరణపు మెరుపులతో
రమణీయమైన మార్పు..
ఆశలు నింపుతూ
అడుగులు కదపమని
అనునయిస్తూ వెన్నుతట్టు
ఆదిత్యుని అనుగ్రహపు తీర్పు!
ఉదయ హృదయ గీతమై
ఉత్సాహం నింపి కొత్తగా
ఉల్లాసం పెంచి ఉరికించే
మయూఖ స్పర్శ వరం!
వెలుగు వాకిట వెచ్చగా
చెలగి నాలుగు చెరగులా
వెలుతురు ముగ్గులేస్తూ
ఇలను మేలుకొలుపు అనుదినం
గడచిన గతపు కష్టాలను
మరచిన నేటి ఇష్టంతో
నడిచే రేపటి పయనంలో
తడిపే వెలుగుల అనుగ్రహమై!
అనుభవాల సారం ఇచ్చే
అనుభూతుల పరిమళమే
అణువణువున మోదం నింపే
అందమైన జీవన సంగీతం
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి