ముద్ర పడిన
కాగితం అతిభద్రం.
మనదంటూగుర్తింపున్న
మనుగడచెరుకుగడే.
జీవన శైలికి బీద ధనిక భేదాలు
అబద్దమే.
క్రమ బద్ధమైన జీవితం .సూర్యోదయ, సూర్యాస్తమయాల మధ్య
నీ అడుగులు పడాలి గడియారానికి
అనుగుణంగా.ప్రతిపనీ, నీదిగా చేయ్యి పని ఎవరిదైనా.
పనిలో చేవ,నిర్దిష్టత, దృఢనిర్ణయం మాటలో తేట, నిలకడ,సత్య సంసిద్ధత.
సమాజంపట్ల బాధ్యత ఆధ్యాత్మికచింతన
మానవత్వపు పరిమళం. అన్నికలిగిన మనిషి జీవనశైలి
పారిజాత సుమ పరిమళం. దానికై
కృషి చేయాలి అనుక్షణం
నీ జీవన శైలి కావాలి పదు గురికి పూలతోట,
నడిచేబాట, వికసించిన,గులాబీలతోట.
తిరిగే కాలచక్రంలో కలిగే మార్పులు చేర్చుకుంటుండాలి
నేర్పుగా మన జీవనశైలిలో. మన మనోభావాలు దెబ్బ తినకుండా.
నైతిక విలువలు చెడకుండా. పాతను గౌరవిస్తూ, వర్తమానాన్ని
అనుసరిస్తూ, భవిష్యత్తును ఆహ్వానిస్తూ మన జీవనశైలిని మలుచుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి