****
అవ్వా! దినాం నేను చేత్తున్న చాకిరీని ఎవలన్న గుర్తిత్తుండ్రా?ఎంత బాగ చేత్తుండని ఒక్కలంటే ఒక్కలు మెచ్చుకుండ్రా?"
"ఏందిరా వారీ! తెగ ఇదై పోతున్నవ్? సంగతేందో శెప్పకుండనే గుర్తిత్తుండ్రా? మెచ్చుకుండ్రా? అంటే ఇనేటోళ్ళకి ఎట్ల సమజైతుంది?"
"గదేనవ్వా! పొద్దున్నే లేత్తే కొట్టంల బర్ల పెండ దీసుడా! కుడితి బెట్టుడా! కొట్టమంత శుబ్బరం చేసుడా! అడివిలకి గొడ్లను మేప్కపోవుడా! పొలం కాడి పన్లు సూస్కునుడా! ఇంట్లె పెళ్ళాంతో సుత ఎవ్వలి కడ్పు మాడకుండ తిండి వెట్టుడా! గింత జేత్తున్నా ఇటు పక్కింటోడు గాని,అటుపక్కింటోడు గాని మస్తు పనులు జేత్తడు అని ఎన్నడన్న ఎన్కనో ముందునో అనంగ సూడనైతిని.
నా ఈ పనిని ఇంగెవలన్న కళ్ళు బెట్టి సూత్తుండ్రో లేదో? గని నేను మాత్తరం దినాం ఇల్లెడు పని శేత్తున్నవ్వా!..."
అవునా వారీ! అయితే నువ్వు మామూలు కంటే శానా శానా పన్లుజేత్తున్నవన్న మాట.ముందుగ నిన్నో మాటడుగుత గని గుస్సా అవ్ళొద్దు గిదంత బయటోళ్ల కోసరమా? నువ్వు ౙసేది? ఇంట్లోళ్ళ కోసరమా గజ్జెప్పు?
గదేందవ్వా! శాకిరి శాకిరి గాకుండా పోతదా..?
ఎందుకు పోతదిరా అయ్యా?"
"ఎన్కట నీలాంటోడే ఆలికి/ పెళ్ళానికి అన్నం బెట్టి ఊరికి ఉపకారం చేసినట్లు చెప్పిండంట". ఆలి పరాయిదా ఇంట్లెదే గదా! ఇంట్లోళ్లు బయిటోళ్ళు కాదుగా అయ్యా!"
ఇంక నయ్యం నేను దినాం మీ కోసవే తానం జేత్తున్న, బువ్వ తింటున్న,మూతి గడుక్కుంటున్న అని శెప్పలే బత్కిచ్చినవ్!"
ఊల్లె కొంతమందిరిని ఎందుకు తలుత్తరు... ఊల్లె శెరువులు పూడికలు తీయిచ్చుడో,వనజీవి రామయ్య లెక్క రోడ్ల పొంటి శెట్లు నాటుడో.. మంచి నీళ్ళ వసతి గల్పిచ్చుడో.బల్లె సద్వుతున్న పొల్లగాండ్లకి రాస్కోనికి వయ్యిలు, పెన్నులు కొనిచ్చుడో.. ఊల్లె ఎవలన్న పేదోళ్ళు ఉంటే గాళ్ళ కట్టంల శేతనైన సాయం జేసుడో ఊరికి ఉపకారం గని నీ యింట్లె నువ్వు జేసుకొనుడు ఊరికి ఉపకారం ఎట్లయితదిరా అయ్యా?!" నువ్వే జెప్పు."
గాల్లిద్దరి ముచ్చెటి ఇంటున్న బుడ్డోడు భూలచ్మి ఇద్దరూ ఒక్కపాలె" అవ్వా! గియ్యాల మా బల్లెకి ఓ పెద్ద మడిషి వొచ్చిండు పదో తర్గతోళ్ళకి పరీచ్చలు రాసుతునేందుకు అట్టప్యాడులు, పెన్నులు,కంపాసు బాక్సులు ఇచ్చి గాళ్ళు బాగా పరీచ్చలు రాసి పట్టొత్తే డబ్బులు సుత ఇత్తరట శెప్పిండ్రవ్వా!"
"విన్నవార వారీ! గది ఉపకారం అంటే" సమజైందా! గిదంత నీకు తెల్వక గాదు. అవ్వేం జెప్తదో ఇనాలని అడ్గినవ్ కదరా అయ్యా! నాకంటే నువ్వు నాలుగాకులు ఎక్కువ సద్వినవేమొ గని నేను నీ మన్సుల ఏముందో ఆవులిచ్చకుండనే పేగులు లెక్కబెడ్తడు అన్నట్టు నువ్వు గా మాట అడ్గినప్పుడే తెల్సింది " అనంగనే ఏమనాలో తోసక నేలకి తలకాయ ఏసిండు సింహాద్రి.
గదండీ సంగతి "ఆలికి అన్నం బెట్టి ఊరికి ఉపకారం చేసినట్లు చెప్పిండంట" అంటే కనీస ధర్మంగా ఇంట్లె వాళ్ళకి సేశేది ఊరికి ఉపకారం కాదని తెల్సుకోవాలె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి