హోలీ ఆటలు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చిన్నారి పాప వచ్చింది
గోగుపూలు తెచ్చింది
కుండలో వేసి పెట్టింది 
పోయి మీద కాచింది 

రంగు తయారు చేసింది 
బొంగు కర్రలు తెచ్చింది 
వాటి నిండా నింపింది 
రెండు చేతుల్లో పట్టింది 

అటు ఇటు తిరుగుతూ 
గిరగిర చేతులు తిప్పింది 
పిల్లల వద్దకు చేరింది
రంగు లన్ని గుప్పింది 

బీర బీర పరుగు తీసింది 
గదిలోకి దూరి దాగింది 
తోటి పిల్లలు వచ్చారు 
పాపకు రంగు చల్లారు 

కెమికల్ లేని కలర్లతో
కేరింతలు వేసుకుంటూ 
హోలీ ఆటలు ఆడారు
సంతోషంగా ఉన్నారు 


కామెంట్‌లు