వేచిన ఎదలకు
వేకువ సవ్వడి
వేణు నాదంలా...
పూచిన తోటకు
విచ్చిన విరుల
వసంత రాగంలా....
చక్కని తోటలోకి
ఒక్కసారిగా వచ్చిన
పెక్కు కోయిలల గానంలా
ఊహల శిలపై మదిలో
చూపుల ఉలితో చెక్కిన
శిల్పం చేసే నాట్య గీతంలా..
చినుకుల పిలుపుకు
మొలకల బదులుగా తోచు
ఇల పాడే ఇంపైన పాటలా..
ఎద సడి మువ్వలుగా
ఎడద చేయు నర్తనపు
ఎలదేటి సొదలా...
నీలి నింగిలో సాగే
పాలమబ్బుల పల్లకి
మోయు గాలి సవ్వడిలా..
భావ తరంగాల జడిలో
హాయి కలిగించు తలపుల
వేణు గానమై తోచు
వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి