సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -175: - ఆ ఊరికి ఈ వూరు ఎంత దూరమో - ఈ వూరికి ఆ వూరు అంతే దూరం"

****
అనుకుంటుర్రేమో! ఆళ్ళు జేసింది మర్శిపోయి ఎప్పటొతికె ఉంటనని. గాళ్ళు పెట్టిన కిరికిరి పన్లు గిప్పటికి సుత బాదవెడ్తనే ఉన్నయి.ఎట్ల యాది మరుస్తవ్వా! నువ్వే జెప్పు?
"అవును శెల్లె! కొన్నిశయాలు ఎంత మరుద్దామన్న మర్పు రావు.సయిమం వొచ్చినప్పుడు ముళ్ళులై గుచ్చుతూనె ఉంటయి.మన్సుకు ఎంత కట్టమైందో నీ మాటలింటుంటే నే తెలుత్తాంది.
 "అవునవ్వా! "ఏరాలు ఎచ్చనియ్యదు -సవితి సాగనియ్యదని ఊకెనే అన్లే. గా ఏరాలు,బావలు ఆత్తి పంపకాల కాడ పెట్టిన కన్నమ్మ కట్టాలు ఎట్ల మరుపొత్తయి అవ్వా!తల్సుకుంటే కడపు మస్లిపోతుంది."
"నిజం శెల్లె! ఒంటికి తాకిన దెబ్బ కొన్ని దినాలకి మానుద్ది గని మన్సుకు తాకిన దెబ్బ ఓ పట్టాన మానదు.ఎప్పుడూ సలుపుతనే ఉంటది."
"గందుకే ఓ పెద్దాయన అన్నడు ఇనుము ఇరిగితే కాక బెట్టి అతికియ్యొచ్చు గని మన్సు యిరిగితే అతికియ్య లేరని."
"సరె గని శెల్లె గిదెందుకు గిప్పుడాదికొచ్చిందో శెప్పనే శెప్పవైతివి." 
 "ఏండ్లేదవ్వా! మా ఏరాలి శిన్నబిడ్డ లగ్గమట. లగ్గ పత్రిక సొయంగ ఇచ్చే మొకం లేక ఓ సుట్టపాయనతో పంపిండ్రు. మిలిగిన సుట్టపోళ్ళ ఇండ్లకెళ్ళి సొయంగ ఇచ్చొత్తుంటే కండ్లార సూశిన. గంత ఏరుబందం జేత్తుంటే ఎట్ల వోతవ్వా?.
గదే నా బిడ్డ లగ్గానికి పౌరుషాన్ని పక్కకి బెట్టి నేను మా ఆయన ఇద్దరమెల్లి లగ్గం కారటు శేతిల బెట్టి తప్పకుండ రమ్మని శెప్పొచ్చినం. దేనికైనా పట్టిడుపులు ఉండాల్నా లేదా? రానే రాకపొయిరి.
మాకు మాత్తరం అనిపించదా శెప్పవ్వా! ఇంగెట్ల బోతం. గాళ్ళు రానప్పుడు గిప్పుడెట్ల వాలాయిఁంచి బోతం మాకు. మాకు సుత కూసింత ఇంగితం ఉంది కద!"
అంతేలే శెల్లే! "ఆ ఊరికి ఈ వూరు ఎంత దూరమో-ఈ వూరికి ఆ వూరు అంతే దూరం"
 "మా బాగ శెప్పినవవ్వా! గాల్లెట్ల జేసిండ్రో గిప్పుడు మేం సుత బరాబర్ గదే శేత్తునం.పిల్ల లగ్గమప్పుడు పతొక్కరు గాళ్ళని అడుగుడే. గిప్పుడు గాళ్ళని సుత మా గురించి అడగరా ఏంది?"
 "ఎందుకడగరు.సుట్టపోళ్ళు ఉన్నదే గస్మంటి ముచ్చెట్లు తశ్వా జేయడానికి.
"నేనైతే ఆవ గింజంత సుత కరగనవ్వా? కడ్పుల బాద ఎల్లగక్కుకోడాన్కి నీ తానికి  వొచ్చినవ్వా! ఇంగ బోత. శాన పనుందవ్వా. వొత్తా!"
 అన్కుంట బోతున్న నీరజవ్వ వొంక సూస్కుంట రంది జేయకు శెల్లే! నీకు అంత మంచే జరుగుద్ది.ఫికర్ జెయ్యకు" అని జెప్పి ఊరడిచ్చి పంపింది. 
గదండీ సంగతి. పాలి పగలు గిట్లనే ఉంటయి. ఆ గందుకే గిస్మంటి సామెతలు బుట్టినయి.
కామెంట్‌లు