సర్వోదయ గ్రామీణ గ్రంథాలయం
జాజాపూర్ గ్రామం, నారాయణపేట మండలం & జిల్లా, తెలంగాణ.
సిద్దన్న విద్యా సంస్థ వారి సౌజన్యంతో
రిజిష్టర్ నెం. 3550/1999
విషయం:
శ్రీమతి డా. కందేపి రాణీప్రసాద్ కథా రచయిత్రి గారికి శుభోదయంతో బాటు ధన్యవాదములు.
అడిగిన తడవుగానే మీ రచనలను పంపి మా గ్రంథాలయాన్ని కథాలయంగా మార్చినందుకు మా పాఠక పిల్లల ఆనందానికి సహకరించినాయి.
1. ‘‘ నాజ్ఞాపకాల్లో అమ్మ’’ పన్నెండు నివాళి కథల వల్ల మా అమ్మ 99 సం.వయస్సులో ఆరోగ్యంగా లింగైక్యం చెందిన స్మృతులను సుడులు సుడులుగా కళ్ళముందు కదలాడినాయి.
2. ‘‘ రాణీ ప్రసాద్ కథలు'’’ ముప్పయి చందమామ కథలు, జంతువుల ప్రవర్తన - మానవులకు మేల్కోలిపిన విధానం, పిల్లల ప్రవర్తనలో పరివర్తన వచ్చే విధంగా ఉంది.
3. ‘‘ హౌజ్ వైఫ్’’ కవితా సంపుటిలో 96 కవితలు కనులిప్పు కలిగే కందేపి హృదయాన్ని ఆవిష్కరించారు. డాక్టరుగా, కవయిత్రిగా, అనువాదకురాలిగా, బాల సాహితీవేత్తగా, సి.నా.రేతో మీ చిత్రం సగర్వంగా ఉంది. కందేపి రాణి - కధలరాణిగా అభివర్ణించవచ్చు.
4.‘‘ డాక్టర్ చెప్పిన కథలు’’ 25 నిత్య జీవితంలో ఆటపాటల్లో అల్లరి చిల్లరగా చేసే పిల్లలు ఆకస్మత్తుగా జరిగే ఆపదల నుండి ఎలా కాపాడుకోవాలో వివరించిన కథలు. తల్లిదండ్రులకు, సమాజానికి మేలు చేకూర్చి – నివారించే విధివిధానాలను సవివరంగా చెప్పిన తీరు హృదయాలను, మీ కథలకు హత్తుకునే విధంగా ఉన్నాయి కథల రాణీ.
5.‘‘ స్వీటి మిల్కి, ఓ చిలక ’’ 16 చిట్టి కథలు అందాల చిరు కథలు. మీ ప్రిస్కిప్షన్ ప్యాడ్‌లోని సాహిత్యం - మిల్కీ మ్యూజియం, బాలల విద్యా వికాసానికి సహకరిస్తాయి. అంతగాక పిల్లల్లో అత్మవిశ్వాసం, నేర్పు, నైపుణ్యం కల్గిస్తాయి.
6.‘‘పూలతోట’’ ముప్పయి తేనే పాటలు నీ నగుమోమును తలపించే మెరుపు నవ్వులు కురిపిస్తున్నాయి. ప్రతి పాట పిల్లల బాల్యాన్ని పరిమళింప జేసి పరవశింప చేస్తాయి. అదే కథలరాణి, కందేపి గారి ఊహగానం. హృదయగానం, ఉదయ రాగం, అందాల ఆనందహేల.
7.‘‘ పూలజడ ’’ లోని 16 బాల్య జ్ఞాపకాల సమాహారం, నలుగురమ్మాయిల గల పూల జడలు తలనిండా వాలుతూ తూలుతూ, కొప్పులు సవరిస్తూ, పూల మాలలను, బుట్టలు బట్టలుగా నింపారగా, ఒంపు సొంపులతో వయ్యారంగా సుగంధ పరిమళాల పడుతులెందరో చందమామ లాగ కొప్పులు ధరించి, వాలు జడల వయ్యారి భామ కనువిందు చేసే రీతిలో అల్లిక కథలు మనోరంజకంగా ఉన్నాయి.
8. ‘‘ నందివర్ధనాలు ’’ నానీలు డా.యన్ గోపి గారికి తత్సమానంగా రచించి, మీ శ్రీవారి కంకితమిచ్చిన నీ తెల్లని వెన్నలాంటి మనసు, వారి వెన్నెల వంటి తెలుపు, మీ సాహిత్యం - వారి వైద్యం, కలిసి మనసుల ఆరోగ్యం, మీరిద్దరి మనస్సులు కలిసిన దివ్య ఔషధం ప్రజారోగ్యంతో పాటు, సాహిత్య ఆరోగ్యం అందిస్తుంది. ఇదొక కదంబం. మీరిద్దరొక కదంబం. మీరు సాహిత్య రాణి - వారు ఆరోగ్య రాజు. మేమంతా జనులం. మీరు చేస్తున్న సాహిత్య వ్యవసాయం – మీ వారు చేస్తున్న వైద్య వ్యవసాయం అభివందనీయం. ఇట్లు.... మీ బువ విధేయుడు
విద్య/ వివేకం -విజ్ఞానం / నైపుణ్యం-వినోదం / విలువలు: -డా. ఆచార్య ఆవుటి జగదీష్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి