జలము నుండి పుట్టేను భూమి ,
ఆ భూమి నుండి పుట్టిన
ఆహారౌషధముల మూల ముననే...
పుట్టిన ప్రాణి కోటి మనుగడకు...
నీరెంత ముఖ్యమో... వేరే చెప్పాలా...!?
అంత విలువైన నీటిని వృధా చెయ్యొచ్చా..?!
నీరు లేనిదే పంట లుండవు తిండి దొరకదు...!
నీరు లేనిదే దాహం తీర దుకదా...!!
నీరే లేకపోతే మురికి పట్టి, కంపు గొట్టుకు పోము...!?!
నీటి కోసమేకదా...దేశాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు...!!
ఇంత విలువైన నీరు మనకు ఆ సర్వేశ్వరుడు ఉచితంగా ఇస్తుంటే...
డబ్బులు పెట్టినా దొరకని దుస్థితిని దాపురింప జేసుకో వచ్చా....!?
ఉన్న నీటిని కాలుష్యా లతో నింపేయ వచ్చునా...?!
నీటిని పరిరక్షించుకుందా0....
మన బతుకుల్ని సం రక్షించుకుందా0...!
****
నీరు : కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి