పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును, కొత్తూరు మండలం గూనభద్ర డోలోమహోత్సవాల వేదికపై ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. శ్రీశ్రీశ్రీ రాధాకాంతస్వామి 90 వ డోలో మహాత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై ఈ సన్మానం జరిగింది. ఉత్సవ కమిటీ ప్రతినిధి, కొత్తూరు రచయితల వేదిక కార్యవర్గ సభ్యులు అంపిలి ప్రశాంత్ కుమార్, పి.ఎం.పాలేం సర్కిల్ ఇన్స్పెక్టర్ గేదెల బాలకృష్ణ, గణిత శాస్త్రోపాధ్యాయులు జి.వి.భాస్కరరావుల నేతృత్వంలో విద్యా సాంస్కృతిక సామాజిక సేవా రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను సన్మానించే నేపథ్యంలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తిరుమలరావుకు లభించిన గౌరవం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
తిరుమలరావుకు డోలోత్సవాల వేదికపై సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి