***
"గీడేజ్జేసినా గంతే అవ్వా!" ఏదన్న జెయ్యాలంటె పది త్యేపలైన యిషారించాలిరా అయ్యా! ''అని నెత్తి నోరు బాదుకొని జెప్పిన. అయిన ఇనుకుంటెనా?"
"ఏంది శెల్లే! ఎవలి సంగతి? మీ శేషు గాని సంగతి గాదు గద?"
ఇంకెవలి సంగతి నాకేం దెలుత్తదవ్వా? గీని సంగతే.గీడు ఇంట్లె ఉండబట్టి తెలుత్తున్నయి.లేకపోతెనా గాడు శెప్పేరకమేనా? శేతులు గాలింతర్వాత ఆకుల కోస్రం ఎతుకుతడు సూడు.గప్పుడు తెల్శేది.
"అయిన గని అవ్వా!గాని బుర్రలో పురుగు ఏమని దొలుత్తదో తెల్వదు గని,గాడు జేసేది సూత్తుంటే మాత్తరం గీని బవిషెత్తు బెమ్మాండంగ ఎలిగి పోద్ది అనిపిస్తదవ్వా!
"అవునా శెల్లె. గంత మంచిగ అన్పిచ్చి మల్లెట్ల కుదేలైతడు. ఎవలన్న పడీపడనోళ్ళు పుల్లలు గిట్ల పెట్టట్లే గద. గీ దినాల్ల ఒకల్ని సూశి ఒకడు ఓర్సుడే లేదు.గట్లేమన్న కాట్లేదు గద?"
దేవుని దయ వల్ల గస్మంటియి గిప్పటిదన్క ఎదురు వల్లేదవ్వా! గీడు మొదలు వెట్టేటప్పుడు సూడాలి.నువ్వన్నట్టు గీని ఎదుగుడు ఎవలన్న ఓర్సకుంటైతరా ఏంది అని సుత అన్పిత్తది."
గా నడ్మల ఓ కంపెన్ల మంచి ఉజ్జోగం వొచ్చిందవ్వా! ఒక్క నెల వోయిండో లేదో గాని కాడ నేను జేసుడేంది నాకిందనే నల్గురు జెయ్యాలె.నేను వోను గా కొలువుకని గా ఉజ్జోగం వొదిలి పెట్టిండు.
"గదొదిలి ఏం జెయ్యాలె? ఏం జెయ్యాలె అని ఒక్క తీర్గ ఇశారిచ్చి బట్టల దుకణం బెడ్తనని ఈర లెవల్ల అట్టాసం జేసిండు. నల్గురు గుమాత్తాలను బెట్కొని నడిమజ్జె సెంటర్ల ఓ మడిగె కిరాయికి దీసుకొని మొదలు వెట్టిండు.మంచిపేరు వొత్తుందనే యాల్లకి గీడి అతి మంచితనం వొల్ల గుమాత్తాలకి జీతాలు ఇయ్యలేని తితికొచ్చి నెత్తిన గుడ్డేస్కుని మూశేసిండు. గట్ల పదేనిర్వై లచ్చల రూపాయల శీరెలు ఉద్దెరిచ్చి గవి లాక్కోలేక పీక్కోలేక కిందమీద అయితుండు."
"అయ్యో! గట్లనా శెల్లె? అయితే గిప్పుడు ఉత్తగనే ఉండా?"
అట్లుంటే గాడెట్లయితడు. మల్ల గీ నడ్మల ఇద్దరు దోత్తుగాల్లనేసుకొని టిపిని బండి నడ్పుడు షురూ జేశిండు. నేను సుత ఇంట్లె ఇద్దరు మడుసుల్ని బెట్టుకొని గాడు బాగుపడితే సాల్లే అన్కొని రెక్కలు ముక్కలు చేసుకున్న.
గిస్మంటి ఆటికి మంచి గిరాకీనే గద శెల్లె! గిస్మంటియి యాడ జూసినా జెనం ఎగబడి తింటుండ్రు."
అవునవ్వా! గాడి తల్కాయమీద దరిద్రం డీజే ఆడ్తుంటే గది సుత యాడ జేస్కోనిత్తది."
"ఖాతలు బెరిగనయి. మంచి పేరొచ్చింది. దోత్తుగాళ్ళు సుత సంబురపడ్తుంటే గీని మెదల్ల ఏం దిరిగిందో ఏమో.గీదీన్ని సుత వొదిలేశిండు. శెప్పితే ఇనడాయె. వొంట బుట్టదాయె. ఏం జెయ్యాల్నో తెల్వడం లేదవ్వా!"
శెల్లే! గిస్మంటోళ్ళ శేతల్ని జూసి మన పెద్దోళ్ళు"ఆరంభ శూరానికి ఆర్బాటమెక్కువ" అన్నరు.
"అంటేందవ్వా!"
"ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు సూశేటోళ్ళకి,ఇంటోళ్ళకిశగాళ్ళు జేసే ఆర్భాటం సూత్తుంటే గీనికింక డోకా లేదు అన్పిస్తది.గని శివరాకరికి ఇగ్గో గిట్ల జేత్తరు.గందుకే గిస్మంటి సామెత పుట్టింది శెల్లె! "
" ఇంగ నన్న మంచిగుండమని జెప్పు శెల్లె.ఒకపాలి మనింటికి తీస్కరా గానికి అర్థమయ్యేట్టు నేను శెప్త."
"గీ మాట అడగనీకే నీ తానకి వొచ్చిన.రేపే గాన్ని తోల్కోనొత్త". వొత్త అవ్వా! అన్కుంట ఇంటి మొగం బట్టింది."
" గదండీ సంగతి! "ఆరంభ శూరానికి ఆర్బాటమెక్కువ" అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి