మహిళా దినోత్సవం నాడు
మామ్మ సాయంత్రం ఆరుగంటలకే
మా అందరికీ వంట చేసేసి
మనుమలు మాధవుడు,మాధవితో కలసి
మియాపూర్ లో మూడో అంతస్థులో
ముచ్చటగా మూడోసారి టీ-20 ప్రపంచ కప్పు
మనమే గెలుస్తామని
మన ఇంటి ఇలవేల్పు రామయ్యకు మొక్కేనని
మాతో బాటు కూర్చుని
ముగ్గురు మొనగాళ్ళు అభిషేక్ బ్యాటింగ్ 52 తో ఆదరగొట్టి
సంజూ పంజావిప్పి భారీ స్కోర్ 89 తో ఆటాడించి
ఇషాన్ కిషాన్ సుడిగాలిలా హాఫ్ సెంచరీ దాటి 54 తో దడ పుట్టించి
దూబే దూకూడుగా ఎనిమిది బంతుల్లో 26పరుగులు చేసి
న్యూజిలాండ్ ను నాలుగు వికెట్లను బూమ్రా తీసి రఫ్ ఆడించి
అక్షర్ అద్భుతంగా బౌల్ చేసి మూడు వికెట్లను తీసి
ముచ్చటగా మూడోసారి ప్రపంచ విజేతగా భారత్
విజయం సాధిస్తే
మామ్మ మనుమలతో చేసిన హడావిడి
మరువలేని మధుర క్షణం.
మనస్సులో బామ్మ సంతోషం చూసి
కాదేది వయస్సుకనర్హం అనుకున్నాను...!!
..............................
ముచ్చటగా మూడోసారి: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి