నగ్న సత్యాలు - జయా
గాడిదతో బతకొచ్చు 
కానీ
గాడిదలా ఉండే వారితో
బతకలేం

"అరిచి గీపెట్టే వారి" తో 
వాదించవచ్చు 
కానీ
మౌనంగా ఉండే అతనితో
వాదించలేం
అతను
కత్తి కన్నా పదునైనవాడు

కాగితంలో కవిత 
రాసే వ్యక్తితో కంటే
జాగ్రత్తగా ఉండాలి
గాలిలో కవిత రాసే వ్యక్తితో
ఎందుకంటే 
ఇతను చెవిలోకెక్కించి
చిల్లు చేస్తాడు ఒకటి రెండు 
చెత్త కవితలతో

బంగారం మేమీ విలువైనది కాదు
ఓ పిల్లి మెడకు బంగారు గొలుసు కట్టొచ్చు 
ఎలుక కోసం అమ్మేస్తుంది ఆ బంగారు
గొలుసునైనా

ఒక తిన్ననైన రేఖలో 
లేదు జీవితం
అక్కడక్కడా మలుపులను
అర్థం చేసుకుంటే మీరే జ్ఞాని

-- తమిళంలో చదివాను
ఎవరు రాశారో పేరు తెలీదు


కామెంట్‌లు