సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -163; -ఆకు లేని పంట అరవై ఆరు పుట్లు
*****
అవ్వా! గిది ఎప్పుడెప్పుడు నీ శెవిల వేయాలాని వొచ్చిన.
ఏంది శెల్లె! గీ సయిమంల యిత్తనాల శనక్కాయలు పొట్టొలుసుకుంటనో,కొత్త శింతపండు గింజ దీస్కుంటనో మస్తు పన్లతో కిందామీదాబడ్తుండే దానిని.బాగనే తీరిక జేస్కొనొచ్చినవ్.
"ఆఁ ఏం లేదవ్వా? శాన్నాల్లయింది నీతానకి రాక. గట్లనే ఓ ముచ్చెటి నీ శెవిల ఎయ్యాలనొచ్చిన".
ఏం ముచ్చెటి శెల్లె?
అవ్వా! కొంతమందిని అదృట్టాలు పడిశెం బట్టినట్టు పడుతుంటాయట్టుంది. గా  మంగయ్య కొడుకును సూడ్రాదు.ఎన్నాటి పోరడు. గాడిప్పుడు పేద్ద డబ్బున్నోడు అయ్యిండు.
 "గాడు శిన్నప్పుడు బూశిరి బూశిరిగా ఎట్టెట్టనో ఉండేటోడు. మంగయ్య మావకి గీని మీదనే మనియాది ఉండేది. సద్వు అంతంత మాత్తరవే. ఏదన్న గట్టి పని చేస్కొని బతక లేత్తడా అంటే అసలే అర్బకం పోరడు. ఎట్ల బత్కుతడో అని గా యత్త సుత గీని గురించే శెప్పి బాదవడ్తుండె.ఎట్టెట్టా? గస్మంటోడు గిప్పుడు పేద్ద డాబుసరోడు అయ్యిండా? బవ్ ఆచ్చెరంగా ఉంది శెల్లె గింతకి గాడేం జేత్తున్నడో శెప్ప వైతివి శెల్లె!
గాడు ఒక్కటి గాదు అవ్వా! రొండు మూడు శేత్తుండు. మనూరికొచ్చిన ఓ రియలెట్టేటు యాపారితో  దోస్తీ గట్టిండు.గప్పన్నించి గాని దశే మారిందవ్వా? ఇంగ వొచ్చిన లాభాలు బట్కొని వడ్డీలకి తిప్పుతుండు. గిట్ల గాడు మట్టివుట్కొన్నా బంగారమే అవుతున్నది.
 అవునా శెల్లె ! అంటే "ఆకు లేని పంట అరవై ఆరు పుట్లు"అన్నట్టు పైసల పంట పండిచ్చే కిటుకూ దెల్సుకొని గిట్ల ఉన్న పాలికే ఆకాశమంత ఎదిగిండు. 
 గప్పుడు బాద పడ్డ గాని అమ్మ నాయిన్న గిప్పుడు మస్తు మురుత్తుంటరు. గీ దినాల్ల డబ్బుతోనే గద ఏదైనా సాదిచ్చొచ్చు.
అవునవ్వా ! నువ్వు "ఆకు లేని పంట అరవై ఆరు  పుట్లు"అన్నవు గద గదేందో నాకు సమజైతలే అవ్వా*
 సంద్రం ఉప్పు లెక్క చెల్లె! సముద్రం దగ్గరున్న పాంతంలో ఉప్పు పండిత్తరు.గా పంటకు ఆకులుండవు కొమ్మలుండవు. గని పుట్లకి పుట్లు పండిచ్చొచ్చు. అందుకే గా దాన్తో పోల్శిన శెల్లె.
 "గదండీ సంగతి '' ఆకు లేని పంట అరవై పుట్లు " అంటే గిదే మరి.

కామెంట్‌లు