23 ఏళ్ళ వయసులో, ఆమె కుష్టు వ్యాధికి మొదటి ప్రభావవంతమైన చికిత్సను కనుగొంది. అయితే మరో ఏడాదికే ఆమె చనిపోయింది. దాదాపు తొంభై సంవత్సరాలుగా, ఆమె పురోగతికి మరొకరు ఖ్యాతి పొందారు. ఇంతకూ ఆమె ఎవరో చెప్పలేదు కదూ...ఆమె పేరు ఆలిస్ అగస్టా బాల్. ఆమె తెలివైన శాస్త్రవేత్త. కానీ ఆమె చరిత్ర దాదాపుగా మరుగున పడిపోయింది.
ఆమె 1800ల చివరలో సీటెల్‌లో విద్య, ఉత్సుకత జీవితాన్ని మార్చగలవని నమ్మే కుటుంబంలో జన్మించింది. ఆమె తాత యునైటెడ్ స్టేట్స్‌లోని తొలి నల్లజాతి ఫోటోగ్రాఫర్‌లలో ఒకరు.
ఆమె తల్లి అవిశ్రాంతంగా పని చేసింది. ఇళ్ళు శుభ్రం చేయడం కూడా చేసింది. ఆలిస్ నేర్చుకోవడానికి అవసరమైన సాధనాలు ఉండేవి. వాటిలో ఒకటే
సూక్ష్మదర్శిని. అది వైద్యాన్ని మార్చే ఆవిష్కరణకు దారి తీసింది.
ఆలిస్ రసాయన శాస్త్రం పట్ల తీవ్రమైన ప్రేమను పెంచుకుంది. ఆమె చదువులో ఓ విజన్ ఉండేది. ఒకటి కాదు, రెండు బ్యాచిలర్ డిగ్రీలు సంపాదించింది. విద్యార్థి దశలోనే ఆమె శాస్త్రీయ పరిశోధనలను సంబంధించి పత్రాలు సమర్పించింది.
ఆమె ప్రతిభ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆమె హవాయికి వెళ్లి అసాధారణమైనదాన్ని సాధించింది:
హవాయి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందిన మొదటి మహిళగా ఆమె చరిత్ర పుటలకెక్కింది. ఆ డిగ్రీతో పట్టభద్రురాలైన మొదటి నల్లజాతి మహిళకూడా ఆమె. విశ్వవిద్యా లయంలోనే మొదటి మహిళా రసాయన శాస్త్ర బోధకురాలిగా ఆమె గుర్తింపు పొందింది. అప్పటికి ఆమె వయస్సు ఇరవై మూడేళ్ళు మాత్రమే.
బోధన, పరిశోధన కొనసాగిస్తున్నప్పుడు, ఆలిస్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పట్లో ప్రజలను పట్టి పీడించిన వ్యాధుల్లో ఒకటి
హాన్సెన్ వ్యాధి. దీనినే కుష్టు వ్యాధి అని పిలిచేవారు.
ఆ సమయంలో, రోగ నిర్ధారణ అయిందంటే వారిని సమాజం నుంచి వెలివేసేవారు. కుటుంబాలను విడిచిపెట్టి జీవితాంతం వేరే స్థావరాలకు వెళ్ళి నివసించక తప్పని పరిస్థితి. అప్పట్లో వైద్యులకు ఒకే ఒక్క చికిత్స అందుబాటులో ఉండేది.అది చౌల్మూగ్రా నూనె. ఇది చిక్కగా, చేదుగా ఉంటుంది. శరీరం దీనిని గ్రహించడం దాదాపు అసాధ్యం. దానిని శరీరంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, అది తీవ్రమైన నొప్పిని కలిగించేది. పైగా తరచుగా అది విఫలమయ్యేది. దాంతో చాలా మంది రోగులు దానిని తిరస్క రించారు. చాలా మంది మరణించారు.
అయితే ఆలిస్ సమస్య ఔషధం కాదని నమ్మింది. రసాయన శాస్త్రంలో ప్రతిభావంతురాలైన ఆమె తన ప్రయోగశాలలో పనిచేస్తూ, నూనె సమ్మేళనాలతో జాగ్రత్తగా ప్రయోగాలు చేసింది. చివరికి ఆమె దానిని కరిగించి సురక్షితంగా రక్తప్రవాహంలోకి ఇంజెక్ట్ చేయగల రూపంలోకి మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొంది. ఆమె కృషి వల్ల మొదటిసారిగా, చికిత్స పని చేసింది.
రోగులు మెరుగుపడటం ప్రారంభించారు. కొందరు ఐసోలేషన్ కాలనీలను విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చేంతగా కోలుకున్నారు. సంవత్సరాలుగా విడిగా ఉన్న కుటుంబాలు తిరిగి కలిశాయి.
ఆమె సాధించిన ఈ పురోగతి "బాల్ మెథడ్" గా ప్రసిద్ధి చెందింది. చాలా మంది కళాశాల పూర్తి చేయకముందే ఆమె వైద్య శాస్త్రం భవిష్యత్తును మార్చివేసింది. అంతా ఆశాజనకంగా సాగుతున్న దశలో ఓ విషాదం సంభవించింది.
ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో, క్లోరిన్ వాయువు బహిర్గతం వల్ల జరిగిన ప్రయోగశాల ప్రమాదం ఆమెను అకస్మాత్తుగా బలిగొంది.
ఆమె ఆవిష్కరణ ప్రపంచ ప్రభావాన్ని తన కళ్ళతో చూడనే లేదు.
విశ్వవిద్యాలయ అధ్యక్షురాలు, రసాయన శాస్త్రవేత్త ఆర్థర్ డీన్, ఆమె పనిని ముందుకు తీసుకుపోయారు. కానీ ఆలిస్ కృషి మరుగున పడిపోయింది. ఆలిస్ అభివృద్ధి చేసిన చికిత్స విధానాన్ని "ది డీన్ మెథడ్" అని పిలువసాగారు. దశాబ్దాలుగా, ప్రపంచం ఆ పురోగతి అంతా ఆర్థర్ డీన్ దేనని నమ్మింది. డీన్ పేరు వైద్య పత్రికలలో తరచూ కనిపించేది. డీన్ పేరే పాఠ్యపుస్తకాలలో కనిపించింది. డీన్ ప్రశంసలు అందుకున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా మారిపోయింది. దాదాపు తొంభై సంవత్సరాల తరువాత, చరిత్రకారులు, పరిశోధకులు అసలు రికార్డులను తిరిగీ పరిశీలించారు.
వారు ఆలిస్ బాల్ ప్రయోగశాల గమనికలను వెలికితీశారు. ఆమె ప్రచురించిన పరిశోధన. ఆమె పనిలో ఆవిష్కరణను స్పష్టంగా గుర్తించిన రసాయన పద్ధతులు నెమ్మదిగా బయటపడింది. నేడు, చికిత్స మళ్ళీ దాని సరైన పేరుతో పిలువబడుతోంది:
ఆలిస్ అగస్టా బాల్ మానవాళిలో అత్యంత భయంకరమైన వ్యాధులలో ఒకదాన్ని చికిత్స చేయగల స్థితిగా మార్చడానికి సహాయపడింది. ఆమె ఆవిష్కరణ వేలాది మంది రోగులు కోలుకోవడానికి, వారి జీవితాల్లోకి తిరిగి రావడానికి అనుమతించింది.
ఆలిస్ బాల్ సైన్స్‌లో అత్యున్నత గౌరవాలకు అర్హురాలయ్యారు.
ప్రతి విద్యార్థి నేర్చుకునే పేరుగా ఉండటానికి ఆమె అర్హురాలైంది.
చాలా కాలం పాటు, మరుగున పడిన ఆమె కథ నేడు, మనకు గుర్తుకొచ్చింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి