సుప్రభాత కవిత : - బృంద
బ్రతుకు తోటలో 
రంగులు నింపే ఆమని 
నడుచు బాటలో చక్కని 
నవ్వుల పువ్వులు పూయిస్తూ 

చెలిమిలో కలిమిని
పిలుపులో ప్రేమని 
తలపులో  మంచిని 
మనసులో మమతని 
పెంచుతూ.....

మాటలో సభ్యతని 
కోపంలో కరుణని 
అసహనంలో అపేక్షని
ఆలోచనలో ధర్మాన్ని...

స్వార్థంలో పొదుపుని 
తృప్తిలో ధారాళాన్ని 
అహంలో బలాన్ని 
ఇహంలో సుఖాన్ని....

పరిచయంలో పలరింపుని 
స్నేహంలో మధుర్యాన్ని 
బంధంలో బాధ్యతని 
క్షేమంలో జాగర్తని

పెంచుకుంటూ....

చేదుని తగ్గించుకుంటూ 
పులుపును అస్వాదిస్తూ 
తీపిని అనుభవిస్తూ 
కారాన్ని క్షమిస్తూ 
వగరుని తొలగిస్తూ 
ఉప్పుని వలసినంతే వాడుతూ 

కొత్త వత్సరాన్ని కమ్మగా 
మలచుకొనేలా నడిపించమని 
కర్మసాక్షికి వందనములిడుతూ 
పరాశక్తిని అభయమిమ్మని . 
భవుని.. అనుగ్రహించమని వేడుతూ...

ఉగాది శుభాకాంక్షలతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు