ఆకాశంలో జాబిల్లి
దూరంగా ఉంది.
అద్దంలో జాబిల్లి
దగ్గరగా ఉంది.
సముద్రంలో జాబిల్లి
లోతుగా ఉంది
నదిలో జాబిల్లి
పారుతూ ఉంది
చెరువులో జాబిల్లి
చలనము లేకుండా పడి ఉంది.
బావిలో జాబిల్లి
భద్రంగా నిద్రపోతుంది.
అడవిలో జాబిల్లి
ముక్కలు ముక్కలుగా ఉంది..
ఎడారిలో జాబిల్లి
ఒంటరిగా ఉంది.
పర్వతంపై జాబిల్లి
ఐరావతంలా ఉంది
ఏటిపై జాబిల్లి
పాట లా ఉంది
కోటపై జాబిల్లి
రాణి లా ఉంది.
ప్రపంచ పటంపై జాబిల్లి
మకుటంలా ఉంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి