బీహార్‌లోని చాప్రా రద్దీ వీధుల్లో, చిన్నమ్మాయి తైబా అఫ్రోజ్ తన తండ్రిని, “నాన్నా, ఈ కార్లు, బస్సులు ఎలా నడుస్తాయి? నేను కూడా వాటిని నడపాలనుకుంటున్నాను” అని అడిగిందొకరోజు.
అయితే ఆ చిన్ననాటి ఉత్సుకత ఇప్పుడు వాస్తవంగా మారింది.
ఒకప్పుడు తన సైకిల్ హ్యాండిల్‌ను విమానం కాక్‌పిట్‌గా ఊహించుకున్న తైబా ఇప్పుడు నిజమైన విమానాలనే నడుపుతోంది.
సరన్ జిల్లాలోని జలాల్‌పూర్‌లో ఒక పేద కుటుంబంలో జన్మించిన తైబా ప్రయాణం గురించే ఈ నాలుగు మాటలు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె తండ్రి రేషన్ దుకాణాన్ని మూసివేసినప్పుడు, ఆమె తల్లి ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. పైలట్ కావాలనే తైబా కలను నెరవేర్చడానికి వారి భూమిని అమ్మేసింది.
“ప్రజలు తమ కుమార్తెల వివాహాల కోసం భూమిని అమ్ముతారు, నా కుమార్తెను పైలట్‌గా చేయడానికి నేను నా భూమిని అమ్మేశాను” అని తైబా తల్లి చెప్పింది.
2020లో, తైబా భువనేశ్వర్‌లోని ప్రభుత్వ విమానయాన శిక్షణా సంస్థలో తన శిక్షణను పూర్తి చేసింది. ఆమె డీజీసీఏ DGCA లైసెన్స్ సంపాదించడానికి ముందు 100 గంటలు ఒంటరిగా విమానంలో ప్రయాణించింది.
నేడు, ఆమె విజయవంతమైన పైలట్ గా జీతం సంపాదిస్తోంది.
అనుకున్నది సాధించిన క్రమంలో ఆమె కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఆమె యూనిఫామ్ పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఆమె "నా యూనిఫామ్ నా గుర్తింపు" అని గట్టిగా చెప్పింది.
ఇప్పుడు, ఆమె తన తల్లిదండ్రులను ప్రయాణీకులుగా విమానంలో తీసుకెళ్లాలని, వారిని గర్వంగా మార్చాలని కలలు కంటోంది. దృఢ సంకల్పం, కుటుంబ మద్దతుతో, ఆకాశం కూడా పరిమితి కాదని ఆమె ప్రయాణం రుజువు చేసింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి