అన్నమయ్య : - సి వసుంధర.-చెన్నై

 "ఓ రామ నీ నామ మెంతరుచిరా.
పాలుమీగడలకన్న
పంచదారలకన్న ఎంతో రుచి ఎంత రుచి ఏమిరుచిరా" 
రామదాసు రచనలు భజన యోగ్యమైనవి.
 పల్లెలలో రాత్రివేళ
రామదాసు కీర్తనలుగానం
చేస్తూ భక్తులు  నగరసంచారం చేసేవారు.అందుకే రామదాసు కీర్తనలు రాగప్రధానము అన్నారు చెరుకు వారు అంటే భజన రూపంలో పాడడానికి అనువుగా ఉండే పాటలు.
అన్నమయ్య సంస్కృతాంధ్ర భాష పండితుడు ఆయన పాటలు అర్థం చేసుకోవడానికి ఆలోచనమృతం కావాలి. 
ఆయన పద కవితా పితామహుడు,
దాస్యభక్తితో భగవంతునితో  మనసు విప్పి మాట్లాడిన మహా కవి 
"నాకు శక్తి ఉంటే
నీ సరసన కూర్చునా"
అంటాడు అన్నమయ్య
దేవునితో.
అనాటి తెలుగు  అర్థం చేసుకొంటే అన్నమయ్య పదాలన్నీ అమృతమే.
మొల్ల తేనెసోక నోరు తియ్యనగు రీతి తొడ అర్థమే ల్ల తోపకుండ  ఉండే భాష మూగ చెవిటి వారి ముచ్చటగును అంటుంది. 
మన మాతృభాష మనకు తేలికగా అర్థమయ్యే తీయనైన తేనె వంటి భాష దానిని వదిలి అన్యభాషలైన సంస్కృరంగ్లాలతో
కుస్తి  పట్టడం అవసరమా అంటూ చెరుకు వారు మంచి ఎండాకాలం చెరుకు రసం తాగినంత తృప్తిగా ఆణిముత్యాన్ని తీర్చిదిద్దారు నిజమే దేవుడు కూడా చక్కటి తెలుగులో స్తుతిస్తే తృప్తి పెడతాడు. చెరుకు మహేశ్వర శర్మ గారికి నా అభినందనలు ధన్యవాదాలు 

కామెంట్‌లు