కొత్త ఆశలతో మరో వసంతానికి స్వాగతం
షడ్రుచుల సమ్మేళనంతో
జీవితానికి దారి చూపే
అనుభవాలను మోసుకొస్తున్న
యుగాదికి సుస్వాగతం
అనంతమైన ఆలోచనలకు,
నవ ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉగాదికి ఆహ్వానం
బంధుత్వాలకు,బాధ్యతలకు
చైతన్యమిచ్చే వత్సరాదికి నాందీ ప్రస్తావనం
ప్రకృతిని పులకింపజేసి,
మానవాళికి మార్పులను పరిచయం చేసే నూతనసంవత్సరానికి సుప్రభాతం
అడ్డులేని ప్రపంచశాంతికి నూతన ఉషోదయం
ఆబాలగోపాలానికి ఆహ్లదం పంచి,ఆనందపు అంపకాలు
చేసే తెలుగు పండుగకు ఘననీరాజనం
ఉడుపథమ్మున నిలిచి వెలిగే నూతన కాంతికి ప్రారంభం
కలలు నిజం చేసే అవకాశాలకు అందివచ్చే సమయం
జగానికంతటికి జాగృతిని కల్గించగల పండుగకు నిర్వచనం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి