కవిత్వమంటే...: - — గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.
కవిత్వమంటే —  
అక్షరాల విస్ఫోటనం, ఆలోచనల స్వరం, 
అందాల ఆవిష్కరణ, ఆనందాల ప్రవాహం.

కవిత్వమంటే — 
పువ్వుల పరిమళం, నవ్వుల మాధుర్యం,
ప్రకాశపు కిరణం, ఆశల తరంగం.

కవిత్వమంటే - 
మధురమాటలు, హృదయ గీతాలు, 
భావాల నాట్యం, అమృత ధారలు.

కవిత్వమంటే — 
ఆణిముత్యాల మెరుపు, నవరత్నాల వెలుగు,
మంత్రాల మహత్యం, తంత్రాల సౌందర్యం.

కవిత్వమంటే — 
కల్పనాకాశం, ప్రేమ పరిమళం,
జీవస్పందనం, నిత్య ప్రకాశం.

అనుభూతి అక్షరమైతే 
పుటలపై పుట్టేది కవిత్వం,
హృదయం హరివిల్లైతే 
రంగులై విరిసేది కవిత్వం.


కామెంట్‌లు