సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -155: ఆడింత ఈడింత ఉంటే నాకు మించి నోళ్ళూ లేరు
***
"అబ్బో! గాని మిడిశిపాటు సల్లగుండో! ఎక్కడ ఎచ్చిడి ఎక్కడి అల్పం.గాన్ని సూత్తుంటే ఏమనిపిత్తుందో శెప్పనా అవ్వా!" పైన పెడ్తే పంటల్లేవ్- కిందవెడ్తే ఆనల్ లేవు" అన్నట్టుంది గాని యవ్వారం."
"ఏంది శెల్లె? ఎవడాడు? వొచ్చుకుంట వొచ్చుకుంటనే ఎవన్నో గని బాగనే దొబ్బులు బెడ్తున్నవు?గంత గనం టెంపర్ జేసేటోడు ఎవలబ్బా ! మనూల్లె ఉన్నది?"
 "గాడే అవ్వా! పెద్ద గిలకల బాయి పక్కనే ఉండే ఎన్కటి పెశిడెంటు పోలేరయ్య కొడ్కు పోశయ్య.గదే అవ్వా!పోజులు గొట్టే పోశిగాడంటే ఊరందర్కి ఎర్కే."
 " గాడు ఏం జేసిండు శెల్లె? ఎవల్నన్నా ఆడపొల్లల్ని శడాయించి తన్నులు గిన దిన్నడా? ఎవలి మీదికన్న బొయ్యి పంచాతులు ఇంటి మీదకు దెచ్చిండా?
 "గస్మంటిదేం లేదు గనవ్వా!గాని నాయినకి పాలోల్లకి నడ్మల ఉన్న పంచాతి తెల్సు గద.ఊల్లె ఉత్తర దచ్చినం కాడున్న వొందొంద గజాల తలాలు,అడ్విల బాయి కాడున్న అరెకరం బూవి తగాదా మొత్తానికి తశ్వా అయ్యిందటవ్వా!"
 "అగ్గో గప్పట్నించే గానిలో శిత్రమైన తేడా. గీ పెపెంచకాన్నె ఓడిచ్చినంత సంబురం గనిపిస్తన్నయ్. పతొక్కల్ని పట్టుకొని" ఆడింత బూవి వుంది- ఈడింత బూవి ఉంది. నన్ను మించినోళ్ళే లేరు "అని శెప్పుకుంటుండంట.తెగ ముర్సిపోతుండంటట్పఅందరూ గాన్ని జూశి సాటుమాటుగ నవ్వు కుంటుండ్రు." పోనీలే ఒకప్పుడు బాగా బత్కినోళ్ళు.  అనుకుంటుండ్రవ్వా !"
 " అవునా శెల్లె!ఇంగ నయ్యం ఒక్కొక్కలి కోరుటు కేసులు ఏండ్ల కేండ్లు గక్కడే కోర్టుల్ల మూల్గుతానే ఉన్నయి.గిస్మంటి కేసూలు ఎంట ఎంట తశ్వా గావు. బాగనే అయినయి గీడికి..
గీ గింత గింత ఆటికే ఆడు అంతగనం అడావుడి శేత్తుండు.ఇంకింత ఎక్వెక్కువ ఉంటే ఇంగెంత జేసెటోడో! గదవ్వా!"
 "అవును శెల్లె! గిస్మంటి వాళ్ళని అల్ప సంతోషులు అనాల్నో మరేం అనాల్నో తెల్వదు గని,గీళ్ళని జూశే గస్మంటి సామెతలు బుట్టినయి. "ఆడింత ఈడింత ఉంటే నాకు మించి నోళ్ళు లేరు" అంటే గిదే మరి.

కామెంట్‌లు