కవిత్వం......! : - కోరాడ నరసింహా రావు!

 అమ్మ  ఆలన,లాలన, పాలనలతో  మొదలై... 
ఆనంద, దుఃఖ, క్రోధాది నవరస భావ సుందర వ్యక్తీకరణగాఆవిర్భవించి 
    ప్రకృతి, స్త్రీ ల సందర్య వర్ణ నలతో పల్ల వించి...
  కేవల పద్యములతో... 
    అతికొద్ది పండితుల, పోష కులకే పరిమితమైన కవిత్వమా....! 
   కందు కూరి, గురజాడ వంటి వారి సంస్కరణలతో.... 
  సరలమై అందరికీ అందు బాటు లోనికి వచ్చి
 ఉద్యమాలకు ఊపిరివై... 
  సమాజానికి చేదోడువై... 
కవుల చేతి ఖడ్గానివై చెడుపై అలుపెరుగని సమరం సాగిస్తున్నావు..! 
 రూపము లోనూ, గుణ ములోను అనే కానేక విధముల విస్తరించి... 
 వామనుని లావచ్చి, త్రి విక్రమునిగా... నీ విశ్వ రూపమును చూపించి నా వు...!! 
  ఓ కవిత్వమా....! 
   నీ వలననే ఎందరికో గౌ ర వ మర్యాదలు...! 
  ఎందరెందరికో సన్మాన సత్కారములు...!! 
   నీ వు  ఆనంద ప్రదాయినివి..., 
    నీవే గొప్ప సంస్కర్తవు ఐనావు...! 
  ఓ అద్భుత కవిత్వమా..! 
    నీ కివే నా శత కోటి వం ద న ము లు... 💐🙏🌷🙏💐🙏🌷🙏
కామెంట్‌లు