మనోవీచిక;- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-విశాఖ పట్నం
నాన్నలేని నన్ను అన్నీ తానై పెంచిన మాతృమూర్తి
అరవై ఏండ్ల క్రిందట  అవాంతరాలు ఎదురైనా
అనుకున్నది సాధించమని
నీతి నిజాయితీ వదలకుండా
సంస్కారాయుతంగా మృదువైన మాటలతో
పెదవులపై చిరునవ్వుతో ఆత్మీయ అనురాగాలతో
అందరితో ఉండాలని
ఆపదలో ఉన్నవారికి అభయహస్తమిచ్చి
ఆదుకోవాలని
మనసు చంచలమైనది
రాగ ద్వేషాలు అసూయ అహంకారం
అథః పాతాళానికి చేరుస్తాయని
వాటిని విడనాడి
మానవత్వమే మాధవత్వమని జీవించాలని చెప్పినది జ్ఞాపకమే.

మనసులో ఎన్ని భావాలు  ఉన్నా
అమ్మ చెప్పిన జ్ఞాపకాలను వదలక
మానవత్వం మరువక
అధ్యాపకునిగా నేను మొదట ఆచరించి చదువుతో బాటు విద్యార్థులకు 
సంస్కారాన్ని మానవజీవిత ప్రాముఖ్యతను తెలియచేసి ఉన్నతులుగా తీర్చిదిద్ది
డెబ్బది సంవత్సరాల వయస్సులో
నా మనోభావాలు సఫలమయ్యాయని సంతోషంగా జీవిస్తు
మాతృమూర్తికి ప్రణామాలు అర్పిస్తున్నా.!!
..............................


కామెంట్‌లు