ప్రతి క్షణం పోరాటం
ప్రశాంతత కై ఆరాటం
ప్రజ్వలించు ఆశతో
ప్రభాతపు ప్రచోదనం
వేసే అడుగు తడబడక
మోసే ధ్యేయం ఏమరక
కోసే బాధలకు బెదరక
చూసే చూపు చెదరక......
నమ్మిన ధర్మం రక్షగా...
రెక్కల బలమే ఆస్తిగా
చుక్కలనైనా తాకే
చక్కని గమ్యం చేరేలా...
ఓరిమి విడువని తోడుగా
దారిని చూపే దిక్కుగా
కోరిన విజయం పొందాక
మారును బ్రతుకే పండుగలా!
మనిషిగా బ్రతికే మార్గం
మనసుకు ఇచ్చును ధైర్యం
మనుగడ మధురం అయ్యేలా
మంచిగా నడుపును ధర్మం
అవమానాలెన్ని ఎదురైనా
అలజడి మదిలో రానీక
అలుపే లేక సాగిపొమ్మని
బహుమానంగా దొరికేదే వేకువ!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి